డబుల్ ట్రీట్

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మొన్న వేసవిలో ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్‌ అనే నేను చిత్రం టాలీవుడ్‌ టాప్‌ చిత్రాల జాబితాలో చేరింది. ఇక ప్రస్తుతం మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రం గురించి అంతా చర్చించుకుంటున్నారు.

మహేష్‌బాబు ప్రతిష్టాత్మక, మైలురాయి చిత్రంకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దిల్‌రాజుతో కలిసి అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. 25వ సినిమా ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్‌ ఉన్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు.

అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమాకి టైటిల్‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్ 25 ఫ‌లానా టైటిల్ అని ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదుట‌. అయితే అన్నిటికీ సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఆగ‌స్టు 9న మ‌హేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు స్వీట్ షాక్ ఇవ్వాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకుంద‌ని తెలుస్తోంది.

ఆరోజు మ‌హేష్ 25 ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేయ‌డ‌మే గాకుండా ఈ సినిమా టైటిల్‌ని వెల్ల‌డించ‌నున్నారు అని ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే ఈ చిత్రానికి ఒక టైటిల్‌ను దర్శకుడు అనేసుకున్నారు అని దానికి మహేష్‌బాబుతో పాటు నిర్మాతలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది అని ఫిలిం నగర్ టాక్.

త్వరలో రెండు బ్యానర్‌లు సంయుక్తంగా చిత్ర టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించబోతున్నాయి. టైటిల్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌బాబు ప్రతిష్టాత్మక చిత్రం అవ్వడంతో వంశీ పైడిపల్లి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉగాది కానుక‌గా 5 ఏప్రిల్ 2019కి సినిమాని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

ఈ చిత్రం కొన్నాళ్ళుగా డెహ్ర‌డూన్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.24 రోజుల పాటు జ‌రిగిన షెడ్యూల్ పూర్తైంద‌ని చిత్ర నిర్మాణ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. భారీ షెడ్యూల్‌ పూర్తి చేసిన మహేష్‌ అండ్‌ టీం ప్రస్తుతం షార్ట్‌బ్రేక్‌ తీసుకున్నారు. బ్రేక్ త‌ర్వాత మ‌రో షెడ్యూల్ కోసం అమెరికా షూటింగ్ కోసం ఫ్లైట్ ఎక్కనున్నారా లేక ఇక్కడే షూటింగ్ జరపనున్నారా తెలియాల్సి ఉంది.

Share

Leave a Comment