ఎప్పటికీ గుర్తుండిపోయేలా..

సినిమా సెలబ్రెటీలు గురించి ఎక్కువగా మీడియా లో పలు రకాలగా మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సినిమా పరిశ్రమకే చెందిన వారు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుంటే వారు ఎంత వరకు కలిసి ఉంటారు అనేది చెప్పలేం. కాని ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మహేష్ బాబు టాలీవుడ్ లోనే ఆదర్శ జంటగా నిలిచారు.

పెళ్లి చేసుకుని మహేష్ బాబు నమ్రతల మాదిరిగా జీవితాన్ని గడపాలని, వారిలా లైఫ్ లో ఎంజాయ్ చేయాలని బ్యాచిలర్ హీరోలు అనుకుంటూ ఉంటారు. మహేష్ బాబును వివాహం చేసుకోక ముందు నమ్రత హీరోయిన్. బాలీవుడ్, టాలీవుడ్ ల్లో సినిమాలు చేసిన ఆమె పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా స్వస్థి పలికింది.

మహేష్‌ను కంటికి రెప్పలా చూసుకొంటూ ఆయన కెరీర్‌ను చక్కదిద్దే పనిలో మునిగిపోయారు. మహేష్ యాడ్స్ ఎండార్స్‌మెంట్స్‌ను చూసే బాధ్యతను ఎత్తుకొన్నారు. అలాగే బిజినెస్ వ్యవహారాలను పక్కాగా చూసుకుంటూ మహేష్‌ కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే పనిలో పడ్డారు.

తన భర్తకు అన్ని విధాలుగా సహాయంగా నిలిచింది. అదే సమయంలో మహేష్ బాబులో చాలా మార్పును తీసుకు వచ్చింది. అభిమానులు ఆయన నుండి ఏం ఆశించారో దాన్ని ఆమె తీసుకు వచ్చింది. మొదట మహేష్ బాబు నలుగురిలో స్వతహాగా కలిసేవాడు కాదు. చాలా మొహమాటస్తుడు. ఆయన తీరును కొద్దిలో కొద్దిగా అయినా నమ్రతా మార్చారు.

వంశీ సినిమా సమయంలో వీరిద్దరికి పరిచయం అయ్యింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని అప్పటి నుండి ప్రేమించుకున్నారు. నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్న ఇద్దరు కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు పాప ఉన్న విషయం తెల్సిందే. ఆ పిల్లలతో వీరి జీవితం చాలా సంతోషంగా సాగుతుంది.

వీరి వివాహం అయ్యి 15 సంవతవ్సరాలు అవుతుంది. ఈ సందర్బంగా మహేష్ బాబు తన భార్యకు 15 సంవత్సరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయగా.. నమ్రత కూడా చాలా విభిన్నంగా మహేష్ బాబుకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశామార్చారు. వీరిద్దరి మద్య అన్యోన్యంను చాటి చెప్పే ఫొటోలను పోస్ట్ చేశారు.

ఈ ఫొటోలో నమ్రత గట్టిగా మహేష్ ని కౌగలించుకుని ఉంది. ఈ ఫోటో నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తోంది. మరోవైపు నమ్రత కూడా ఇన్స్టాగ్రామ్ లో మహేష్ తో కలసి ఉన్న ఓ ఫోటోని పంచుకుంది. ఓ అమ్మాయి కోరుకునే పరిపూర్ణమైన జీవితాన్ని నాకు అందించావు, మన పిల్లలు, ఇల్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. హ్యాపీ 15 మహేష్ అని నమ్రత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. వరుస విజయాలతో టాలీవుడ్‌లో ముందుకెళ్తున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి చిత్రాలతో సరికొత్త కలెక్షన్ల రికార్డులను సొంతం చేసుకొన్నాడు. తాజాగా ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ వద్ద మహేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఇవన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి మహేష్ 27వ చిత్రం ఒక్కటే అఫీషియల్ గా కంఫార్మ్ అయింది. త్వరలోనే వంశీ పైడిపల్లితో తన తదుపరి సినిమా చేయనున్నాడు. గతంలో మహర్షి వంటి హిట్ ఇచ్చిన స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మరో సారి కొత్త కథ కధానాలతో మన ముందుకు రానున్నారు.

Share

Leave a Comment