అద్భుతంగా గడిచింది

సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లడం మహేష్ బాబుకు అలవాటు. సెలవులు దొరికితే ఫ్యామిలితో స‌రాదాగా టూర్స్ కి వెళ్ళే లిస్ట్‌లో మ‌హేష్ ముందుంటార‌ని చెప్పొచ్చు. ఆయన తాజాగా చిత్ర ‘మహర్షి’ షూట్ ముగియడంతో సూపర్ స్టార్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళారు.

జ‌న‌ర‌ల్‌గా ఎప్పుడు షూటింగ్స్‌తో బిజీగా ఉండే మ‌హేష్ కాస్త రిలీఫ్ కోసం విదేశాల‌కి వెళుతుంటారు. ఎక్కువ‌గా పారిస్ ఇష్ట‌ప‌డే మ‌హేష్ హాలీడే వెకేష‌న్స్ కోసం ఎక్కువ‌గా అక్క‌డికే వెళుతుంటాడు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి పారిస్ లోనే వేసవి తాపం నుంచి సేద తీరుతున్నారు.

ఆదివారం సాయంత్రం ప్యారిస్‌కి ఫ్లైట్ ఎక్కిన వారు, అక్కడికి వెళ్లే ముందు దుబాయ్‌ని కూడా విజిట్ చేసారని తెలిసింది. ఆదివారం ఈస్టర్ పండుగ కావడంతో ఈ సందర్భంగా అందరినీ విష్ చేస్తూ నమ్రత
తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌లో వారి వెకేషన్ ఫోటోలని అభిమానుల కోసం పోస్ట్ చేసారు.

ఈ మేరకు అక్కడ దిగిన ఫొటోను సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘పారిస్‌లో ఓ సాయంత్రం.. ఫ్యామిలీ టైం’ అని పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి పారిస్‌లో ఒక సాయంత్రం అద్భుతంగా గడిచింది అంటూ మహేష్ బాబు తన ఇన్‍‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

ఈ ఫోటోలో మహేష్, గౌతమ్, నమ్రత ఉన్నారు. మహేష్ ఆడీడాస్ వైట్ కలర్ హుడీ లో ఎప్పటిలాగా చాలా అందంగా ఉన్నాడు. పక్కనే ఉన్న నమ్రత ఇంకా గౌతమ్ లు మహేష్ చెరో భుజం మీదా వాలి ఫోటో కి పోజ్ ఇచ్చారు. గౌతం అయితే నమ్రత కంటే ఎత్తు అయిపోయాడు. మహేష్ తో సరిసమాననంగా ఉన్నాడు.

ప్రస్తుతం ఈ పిక్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా గా నిలిచింది. మహేష్ ఈ ఫోటో షేర్ చేయడంతో అభిమానులు లైకులు, కామెంట్లతో ముంచెత్తారు. మహేష్ బాబు లుక్ చూసిన ఫ్యాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యాక హాలిడే ఎంజాయ్ చేస్తున్న బాబులా ఉన్నాడు మన బాబు’ అంటూ కొందరు కామెంట్స్ పెట్టారు.

‘మహేష్ బాబు, గౌతమ్ బ్రదర్స్‌లా ఉన్నారంటూ మరొకరు తెలిపారు. ఈ ఫోటోల్లో లిటిల్స్ ప్రిన్సెస్ సితార కనిపించడం లేదేంటి? అంటూ మరికొందరు ప్రశ్నించారు. సితార కి సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందరు అభిమానులు సితార పిక్ కూడా పోస్ట్ చేయండి అంటూ మహేష్, నమ్రత ని రిక్వెస్ట్ చేస్తున్నారు.

ప్రొఫెషనల్‌ లైఫ్‌ని, పర్సనల్‌ లైఫ్‌ని భలేగా బ్యాలెన్స్‌ చేస్తుంటారు మహేష్ బాబు. సెట్‌లో నటుడిగా ఎంత అంకితభావంతో ఉంటారో అంతే సరదాగా కుటుంబంతో సమయాన్ని గడుపుతుంటారు. తనకి సినిమా ఇంకా కుటుంబమే ప్రపంచం అని అనేక సందర్భాలలో వెల్లడించిన విషయం తెలిసిందే.

మ‌హేష్ న‌టించిన భ‌ర‌త్ అనే నేను చిత్రం బిగ్ హిట్ కొట్ట‌డంతో ఈ స‌క్సెస్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేసేందుకు పారిస్‌కి వెళ్లి కొద్ది రోజులు అక్క‌డ స‌ర‌దాగా గ‌డిపి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మ‌హేష్ న‌టించిన 25వ చిత్రం మ‌హ‌ర్షి షూటింగ్ పూర్తి కావ‌డంతో మ‌ళ్లీ ఈ విధంగా పారిస్ బాట ప‌ట్టాడు.

వారం రోజుల పాటు పారిస్‌లో గడిపిన అనంతరం మహేష్ బాబు ఫ్యామిలీ తిరిగి హైదరాబాద్ రానుంది. మహ‌ర్షి మే 9న విడుద‌ల కానుండ‌గా ఆ లోపు తిరిగి హైద‌రాబాద్‌కి రానున్నారు. అనంతరం మహేష్ ‘మహర్షి’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు అని తాజా సమాచారం.

ఈ సమ్మర్ సీజన్ లో రిలీజ్ కానున్న సినిమాల్లో మహర్షి మీద ఉన్న అంచానాలు మరే ఇతర సినిమాలపై లేవు. మహేష్ రేంజ్ స్టార్ హీరో సినిమా లేక డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు మహేష్ కొత్త ఊపిరి ఇవ్వడం ఖాయమని ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. అందరి దృష్టి మహేష్ సినిమాపై ఉంది.

పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తున్న‌ ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. మ‌హేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావ‌డంతో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాల‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Share

Leave a Comment