పెళ్లి వేడుకలో మహేష్….

కొందరు టాలీవుడ్ హీరోల కుటుంబాలకు రాజకీయ నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయా పార్టీల తరపున ప్రచారం చేయడం పరిపాటి.

అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం అందుకు చాలా భిన్నంగా వ్యవహరిస్తారు.

ఆయన తండ్రి నటశేఖర కృష్ణ గతంలో కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. ఆయన బావ గల్లా జయదేవ్ ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్నారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వైసీపీకి మద్దతు తెలిపారు.

అయినా కూడా ఇప్పటివరకు మహేష్ ఏ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయలేదు. తనకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని పలు ఇంటర్వ్యూలలో కూడా స్పష్టం చేశారు.

అయితే రాజకీయాలపై ఆసక్తి లేకపోయినప్పటికీ మహేష్ కు మాత్రం కొంతమందితో సన్నిహిత సంబంధాలున్నాయి.

అంతేకాదు ఆయనకు చాలామంది వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలతో కూడా సత్సంబంధాలున్నాయి.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడి వివాహ వేడుకకు ప్రిన్స్…సతీసమేతంగా హాజరయ్యారు.

ఆ పెళ్లిలో మహేష్ దంపతులు సందడి చేశారు. ప్రస్తుతం మహేష్…భరత్ అను నేను చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.

శ్రీమంతుడు తర్వాత కొరటాలతో మరో హిట్ కొట్టాలని ఈ ప్రాజెక్ట్ ను ప్రిన్స్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. మహేష్ – కొరటాల కాంబో మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.

లేటేస్ట్ షెడ్యూల్ నవంబర్ 28 నుండి జరగనుంది. ఈ షెడ్యూల్లోనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట టీమ్. ఓ భారీ ఫైట్ తో పాటు కొన్ని సాంగ్ బిట్స్ పిక్చరైజ్ చేయబోతున్నారు.

అయితే ఈ సినిమాలోనూ కొరటాల ఓ ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌ని ఎత్తుకోనున్నాడనీ తెలుస్తోంది. అది కూడా సామాజికంగా ఎక్కువ ప్రభావితం చూపించేదే అవుతుందట.

మహేష్‌ కనిపించే విధానం, ఆయన నటన ప్రత్యేకంగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది. అభిమానుల అంచనాల ప్రకారమే ఎక్కడా తగ్గకుండా గ్రాండ్ గా సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల.

మరోవైపు తన తర్వాతి సినిమా అయిన తన 25వ సినిమా విషయంలో కూడా మహేష్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడట. కొరటాల మూవీ ఫినిష్ కాగానే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీని స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది.

Share

Leave a Comment