అందమైన జ్ఞాపకాలు

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు, నమత్ర వైవాహిక బంధంలోకి అడుగు పెట్టి నేటితో సరిగ్గా 14 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ స్పెషల్ మూమెంటును పురస్కరించుకుని సూపర్ స్టార్ సోషల్ మీడియా ద్వారా తన అర్దాంగికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

తన ప్రియమైన భార్యతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు మహేష్ బాబు. ‘అందమైన జ్ఞాపకాలు. హ్యాపీ యానివర్సరీ మై లవ్‌’ అని మహేష్ క్యాప్షన్‌ ఇచ్చారు. నమ్రత నవ్వుతుంటే మహేష్ ఆమెను చూసి మురిసిపోతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అభిమానులు ఈ ఫొటోను లైక్ లు, షేర్లతో సోషల్ మీడియా ను ముంచెత్తుతున్నారు. ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అంటూ అభిమానులు వారికి శుభాకాంక్షలు‌ తెలుపుతున్నారు. నమ్రత తన జీవితంలోకి వచ్చిన తర్వాత మరింత సంతోషం తన లైఫ్‌లోకి వచ్చినట్లయిందని మహేష్ బాబు తరచూ చెబుతుంటారు.

ఫిబ్రవరి 10, 2005లో వీరి వివాహం జరిగింది. 14 ఏళ్ల తమ దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు మహేష్, నమ్రత. ఆగస్టు 31, 2006న కుమారుడు గౌతం జన్మించగా, జులై 20, 2012న కూతురు సితార జన్మించింది. టాలీవుడ్ బెస్ట్ క‌పుల్స్ లో ఒక‌రిగా నిలిచిపోయారు ఈ ఇద్ద‌రూ.

ఒక‌రి కోసం ఒక‌రు అన్న‌ట్లుగా ఉన్నారు. ఇన్నేళ్ల‌లో ఒక్క‌సారి కూడా మ‌హేష్, న‌మ్ర‌త జంట‌పై చిన్న రూమ‌ర్ కూడా రాలేదంటే వాళ్ల దాంప‌త్యం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ఇద్ద‌రి ప్రేమ చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. భార్యాభ‌ర్త‌లు అంటే ఇలా ఉండాలి అంటూ వాళ్ల‌ను చూపిస్తున్నారు.

మొత్తానికి ఇద్ద‌రు పిల్ల‌లు, భార్య‌తో లైఫ్ ఆనందంగా మార్చేసుకున్నాడు సూప‌ర్ స్టార్. అభిమానులు కూడా ఈయ‌న్నే ఆద‌ర్శంగా తీసుకుంటున్నారు. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబానికి కూడా కావాల్సినంత టైమ్ ఇస్తాడు సూప‌ర్ స్టార్. పూర్తి ఫ్యామిలీ మ్యాన్ సూపర్ స్టార్.

మహేష్ బాబును కలిసిన తొలి క్షణాలు గురించి నమ్రత గతంలో మాట్లాడుతూ ‘వంశీ సినిమా ముహూర్తం టైంలో మొదటిసారి తనని కలిశాను. చాలా రిజర్వ్‌డ్‌గా, క్వైట్‌గా కూర్చున్నారు. కనీసం హలో కూడా చెప్పలేదు. అప్పుడనుకున్నా ‘ఓ గాడ్, ఈ అబ్బాయితోనా అన్నిరోజులు కలిసి షూటింగ్ చేయాల్సింది’ అని.

షూటింగ్ మొదలైంది. న్యూజిలాండ్ వెళ్లాం. నేనే ఓరోజు ఈ ఇబ్బందిని తొలగించాలనుకుని తనతో కూర్చుని కాసేపు మాట్లాడా. మాట్లాడాక తెలిసింది తను చాలా ఫన్ లవింగ్ పర్సన్ అని, విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉందని, తను మాట్లాడడం మొదలెడితే నవ్వు ఆపలేమని, తనతో కూర్చుంటే టైం అసలు తెలీదని!

తను కూడా కొన్నిరోజులకి ఫ్రీగా ఫీలయ్యి, మాట్లాడడం మొదలెట్టారు. మెల్లగా కలిసి, డిన్నర్‌లకి, సినిమాలు చూడ్డానికి వెళ్లేవాళ్లం. ఇద్దరి స్నేహం అలా మొదలై, ఒకరినొకరు ఇష్టపడేదాకా వచ్చింది అని నమ్రత చెప్పుకొచ్చారు. ఇక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చిందనే విషయం ఇలా చెప్పుకొచ్చారు.

‘ఒకరి మీద ఒకరికున్న ఇష్టం ఏ లెవెల్ దాకా వెళ్లిందంటే, విడిగా ఉండడం చాలా కష్టమనేంతగా, ఇద్దరం సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కలవడం వీలయ్యేది కాదు. ఇద్దరం కలిసి ఉండాలంటే పెళ్లి ఒకటే మార్గం అనుకున్నాం. నా ఫిల్మ్ ఎసైన్‌మెంట్స్ అన్నీ పూర్తయ్యేదాకా వెయిట్ చేసి పెళ్లి చేసుకున్నాం’ అని చెప్పుకొచ్చారు.

ఈ రోజు మహేష్, నమ్రత ల పెళ్లి రోజు తో పాటు వరల్డ్ మ్యారేజ్ డే (ఫిబ్రవరిలో రెండో ఆదివారం) కూడా ఈ రోజే. మహేష్, నమ్రత ఇద్దరూ ఎల్లప్పుడూ ఆనందంగా కలిసి ఉండాలని, ఇలాంటి పెళ్ళి రోజులు వాళ్ళు ఎప్పటికీ ఆనందంగా జరుపుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఆనందంగా తమ శుభాకాంక్షలను తెలుపుతున్నారు.

మావయ్యగారు, బావగారు (రమేష్ బాబు), మా ఆడపడుచులు (పద్మావతి, మంజుల, ప్రియదర్శిని) మాది పెద్ద కుటుంబం. ప్రతి ఒక్కరికీ తమ తమ కుటుంబాలు ఉన్నాయి. అందుకని, అందరికీ వీలైన ప్రతిసారీ కలుస్తాం. ప్రతి ఆదివారం అందరం కలిసి లంచ్‌ చేస్తాం. ఇప్పుడు బాబు బిజీగా ఉండటంతో కొన్నిసార్లు మిస్సవుతున్నాం. కుటుంబమంతా కలిస్తే సందడే సందడి. పిల్లలు, పెద్దలు కబుర్లలో మునిగిపోతాం అని తెలిపారు నమ్రత.

Share

Leave a Comment