కొత్త జోష్‌తో

సినిమాలను, ఎండోర్సమెంట్లను సమానంగా బ్యాలెన్స్ చేసుకోవడం సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషాలిటీ. మహర్షి షూటింగ్ కోసం క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నారు మహేష్. ఆ షూట్ గ్యాప్ లోనే మహేష్ అభి బస్ కు ఒక యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వీడియో ని సదరు కంపెనీ వారు విడుదల చేసారు.

ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. దీనిలో మహేష్ బాబు తన చార్మ్ మరియు స్టైల్ తో అదరకొడుతున్నాడనే చెప్పాలి. రెండున్నర గంటల సినిమా అయినా రెండు నిమిషాల యాడ్ అయినా మహేష్ మనసు పెట్టి చేస్తాడు అనడానికి నిదర్శనం ఈ యాడ్. దీంతో అభిమానులు వీటిని షేర్ల మీద షేర్లు చేసేస్తున్నారు.

వెన్నెల కిషోర్ తో కలిసి మహేష్ చేసిన ఫన్ అలరించింది. ఈ యాడ్ లో నవ్వుతూ సరదాగా కనిపిస్తున్న మహేష్ చాలా హ్యాండ్‌సమ్ గా ఉన్నాడు. యాడ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. నెటిజన్లు మహేష్ మిస్టర్ కూల్ గా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ కామెడీ టైమింగ్ అదిరింది అని అంటున్నారు.

నెవ్వర్ మిస్ ఎ ప్రెషియస్ మొమెంట్ అనే టైటిల్ తో ఈ యాడ్ ని విడుదల చేయడం జరిగింది. మహేష్ ని వెన్నెల కిషోర్ కావలని వేరే ఊరికి పంపాలని చూస్తాడు. తరువాత రోజు ఫంక్షన్లో మహేష్ ని చూసి వెన్నెల కిషోర్ షాక్ అవుతాడు. మహేష్ మీరు చెప్పినట్టే ఫ్లైట్ లో వచ్చేసా అని పంచ్ వేస్తాడు. మహేష్ – వెన్నెల కిషోర్ కాంబో మరోసారి ఆకట్టుకుందనే చెప్పాలి.

అభిబస్ కి మహేష్ నేషనల్ వైడ్ గా అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు.. ఇప్పటికే హిందీ కన్నడ తమిళ్ అన్ని భాషల్లో ఈ యాడ్ విడుదల అయింది. మహేష్ క్రేజ్ కి ఇదే నిదర్శనం. అన్ని చోట్లా ఈ యాడ్ కి ఫుల్ మార్క్స్ పడ్డాయి. మహేష్ రోజు రోజుకు మరింత అందంగా కనపడుతున్నాడని అభిమానులు ఖుషీగా ఉన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కి యాడ్ ఎండోర్స్‌మెంట్స్ విషయంలో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ కంపెనీ మహేష్ తో ప్రచారం చేయించుకునేందుకు తెగ ఉత్సాహం చూపిస్తూ ఉంటుంది. ఆల్ ఇండియా వైడ్ తనకంటూ ఒక గుర్తుంపు ఆండ్ బ్రాండ్ వాల్యూ తెచ్చుకున్న ఒకే ఒక సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ మహేష్ బాబు.

Share

Leave a Comment