కూల్‌గా అదరగొట్టేశాడు

భరత్‌ అనే నేను రిలీజ్‌ తరువాత ఫ్యామిలీతో కలిసి ఫారెన్‌ టూర్‌ వెళ్లిన సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నెక్స్ట్‌ మూవీకి రెడీ అవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా కోసం మహేష్‌ డిఫరెంట్‌ లుక్‌తో కనిపించబోతున్నాడు. హెయిర్‌ స్టయిల్‌ను పూర్తిగా మర్చేసి మేకోవర్‌ ఛేంజ్‌ చేశాడు. మొన్న ఎయిర్‌ పోర్ట్‌లో రఫ్‌ లుక్‌ తో ఆకట్టుకున్న మహేష్‌.. నిన్న జరిగిన రెండు ఈవెంట్ల లో కూల్‌గా కనిపించాడు. మహేష్ స్వాగ్ అని నెటిజన్స్ అందరూ విపరీతంగా ట్రెండ్ చేస్తున్న ఈ కూల్ పిక్స్ మీకోసం…

మహేష్ తన 25వ సినిమా కోసం డిఫరెంట్ ఛేంజోవర్ తో అందరికీ కనిపించి అదరగొట్టేశాడు. “టక్కరి దొంగ” అనంతరం మహేష్ బాబు గెడ్డం లుక్ లో కనిపించబోయేది ఈ సినిమాలోనే. కొత్త షెడ్యూల్ డెహ్రాడూన్‌లో జూన్‌ 17న స్టార్ట్‌ కానుందట. డెహ్రాడూన్‌ అవుట్‌స్కర్ట్స్‌లో ఓ మూడు రోజులు షూటింగ్‌ జరిపి, 21 నుంచి డైరెక్ట్‌గా కాలేజ్‌కి షిఫ్ట్‌ అవుతారట చిత్రబృందం.

Share

Leave a Comment