సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాల వరుస సక్సెస్ లతో మంచి జోరు మీదున్నారు. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు సౌత్ ఇండియాలోనే అత్యధిక బ్రాండ్స్ కు అంబాసడర్ గా కొనసాగుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
ఇప్పుడు మరొక బ్రాండ్ అయన ఖాతాలో చేరిపోయింది. స్పాయిల్ అనే ఈ కామర్స్ ఫ్యాషన్ సంస్థకు అయన బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించనున్నారని నిన్న అధికారికంగా ప్రకటన వచ్చింది. మిమ్మల్ని ఉత్సుకతకు గురి చేసే విషయాన్ని పంచుకుంటున్నాం. ప్రస్తుతం మేం దీని పనిలోనే ఉన్నాం. సీక్రెట్‌ను బయటపెట్టేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి అంటూ వెబ్‌సైట్‌ను మహేష్ బృందం పోస్ట్ చేసింది.
దీన్ని మహేష్ తిరిగి షేర్ చేశారు. ఇందులో మూడు రోజులు కౌంట్‌డౌన్ ఉంచారు. ఈ పేజ్‌లో కింది భాగంలో దుస్తుల రకాలు, బ్రాండ్లు ఉంచారు. దీన్ని బట్టి మరో మూడు రోజుల్లో ఈ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎలాంటివి విక్రయానికి ఉంచుతారో చూడాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం కౌంట్ డౌన్ నడుస్తుంది. ఇందులో లాగిన్ అయితే మహేష్‌ని కలిసే ఛాన్స్ కూడా పొందవచ్చు అని తెలిపారు. ఈ బ్రాండ్ కు సంబంధించిన కొన్ని ఫొటోషూట్ పిక్స్ కూడా సామాజిక మాధ్యాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో మ్హేష్ ఎప్పటిలానే అద్రగొడుతున్నాడు. వీటిని మీరు కూడా ఒకసారి చూసేయండి.
1)
2)
3)
4)
5)
6)
7)
8)
మహేష్ బాబు ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు పలు బిజినెస్‌లు చేస్తున్నారు. ఇప్పటికే ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. గచ్చిబౌలిలో అధునాతన సౌకర్యాలతో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుపుకోగా, ఇందులో మొత్తం 1638 సీటింగ్ కెపాసిటీ తో 7స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి.