డ్యూయల్ రోల్‌లో..

మహేష్ బాబు ఏంటి డ్యూయల్ రోల్‌ ఏంటి అని ఆశర్చపోకండి. మహేష్ ఇలా డ్యూయల్ రోల్ లొ కనిపించింది ఒక యాడ్ కోసం. సూపర్ స్టార్ మహేష్ ఈ యాడ్ లో కొత్త లుక్ ట్రై చేశారు. రెండు విధాలుగా కనిపించి అందరిని సర్‌ప్రైజ్ చేశారు

ఈ డ్యూయల్ రోల్‌ లో మహేష్ అన్న తమ్ముడుగా నటించాడు. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ అంబాసిడర్ గా మహేష్ ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్ ది బిగ్‌ బిల్లియన్‌ డేస్‌ షురూ అంటూ తాజాగా మహేష్ పైన యాడ్ చేశారు. ఈ ప్రచార వీడియోలో మహేష్ కొత్త లుక్ లో కనిపించారు

మహేష్ కెరీర్ లో ఎన్నడూ ఎరుగని పెదరాయుడు గెటప్ లో ఆయన దర్శనం ఇచ్చారు. మహేష్ నయా గెటప్ చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటున్నారు. ఇందులో మహేష్ బాబు మరింత అందంగా కనిపించడం, డ్యూయల్ రోల్ ‌లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో సూపర్ స్టార్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు

తెల్ల పంచె, చొక్కా, భుజంపై కండువా ధరించిన మహేష్ కోరమీసంతో కనిపించడం విశేషం. గ్రామ పెద్దలా మహేష్ ఆ లుక్ లో అద్భుతంగా ఉన్నారు. అదే యాడ్ లో మహేష్ యంగ్ లుక్ లో కూడా కనిపించారు. మహేష్ మరో లుక్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు

40 ప్లస్ లో ఉన్న మహేష్ ఇప్పటికీ కాలేజ్ బాయ్ లా కనిపించడం విశేషం. రోజు రోజు కు ఆయన వయస్సు వెనక్కి వెలుతుందా అనే విధంగా మరింత అందంగా కనిపిస్తున్నారు. ఈ యాడ్ లో మహేష్ అప్పీరెన్స్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది

టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న మహేష్ అనేక కార్పొరేట్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నారు. ప్రస్తుతం ఈ యాప్ కి వీపరీతమైన క్రేజ్ వస్తోంది. ఇక చివరిగా మహేష్ బాబు నాని సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించగా అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొడుకు దిద్దిన కాపురం సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించారు

మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే మహేష్ బాబు ఏజ్ 45 ఏళ్ళు కాదు జస్ట్ 25 మాత్రమే అంటూ మిగిలిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా ఈ లుక్ తో మహేష్ తరువాతి సినిమా అయిన సర్కారు వారి పాట పై హైప్ పెంచేసాడనే చెప్పొచ్చు

ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో సర్కారీ వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం. దర్శకుడు పరుశురామ్ మహేష్ ని ఈ చిత్రంలో ఓ భిన్నమైన పాత్రలో ప్రెజెంట్ చేయనున్నాడని తెలుస్తుంది

మహష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సర్కారువారిపాట షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ మూవ్ ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి

Share

Leave a Comment