హాలీవుడ్ స్టార్‌లా

మన సూపర్‌స్టార్ మహేష్ బాబు స్పెషల్ క్వాలిటీ ఏంటి చెప్పండి? జస్ట్ అలా తన లుక్స్ తో అందరి ప్రాణం తోడేయడం. ముఖ్యంగా చాలా సింపుల్ గా ఉంటూనే ఏ హీరోకి సాధ్యం కాని చరిష్మా ను చూపించడం మహేష్ సొంతం. ఇంక అల్ట్రా మోడ్రన్ గా ఉన్న సూపర్‌స్టార్ ఫొటోలు వస్తే సోషల్ మీడియా కాంగా ఉంటుందా చెప్పండి.

అల్ట్రా మోడ్రన్ లుక్‌లో ఉన్న కొన్ని సూపర్‌స్టార్ ఫొటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రాం ఎకౌంట్‌లో షేర్ చేశారు. ఈ కొత్త ఫొటోల్లో సూటు బూటులో జేమ్స్ బాండ్ లాగా ఉన్నాడు మహేష్. క్లీన్ షేవ్ లుక్ లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని అమెరికన్ బిజినెస్ మ్యాన్ లాగా తయారయ్యాడు. ఇక ఆ స్టైలిష్ నడకతో సూపర్ హ్యాండ్సమ్ గా మెరిసిపోతున్నాడు.

పొరపాటున హాలీవుడ్ కు సంబంధించిన వాళ్ళు కనుక మహేష్ ను చూస్తే ఆయనను హైదరాబాద్ కు ఇక తిరిగిరానివ్వరేమో. ఈ గెటప్ చూస్తుంటే మహేష్ ను డామినేట్ చేసేందుకు హీరోయిన్‌లు చాలా కసరత్తులే చేయాల్సి వస్తుందని అనిపించడం లేదూ. ఎంతైనా సూపర్‌స్టార్ ను అందంతో ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు అని మరో సారి ఋజువు అయ్యింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. మహర్షి నెక్ట్స్ షెడ్యూల్ అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగబోతోంది. 20 రోజులు పాటు అక్కడే షూటింగ్ జరిపి తరువాత హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. అందుకోసం భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో సెట్‌ వేస్తున్నారు.

డబ్బుని మనసుతో ముడిపెట్టిన వాడు మనిషి. మనసుని తపస్సుతో జయించేవాడు మహర్షి. అలాంటి ఓ యువకుడి కథే ‘మహర్షి’. ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్‌ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రిషి పాత్రలో మహేష్ బాబు, రవి పాత్రలో అల్లరి నరేష్ కనిపిస్తారు.

అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని మహర్షి టీం కాంఫిడెంట్ గా ఉన్నారు. ఒక షేడ్‌లో స్టూడెంట్‌గా కనిపించే మహేష్‌ మరో షేడ్‌లో మరింత డిఫరెంట్ గా కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో అధికారిక దృవీకరణ రావలసి ఉంది.

Share

Leave a Comment