మహేష్ కొత్త లుక్ అదిరిందిగా..

ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరో మ‌హేష్. అత‌డి ఛరిష్మాకి బాలీవుడ్ అంద‌గ‌త్తెలు సైతం అద‌రాల్సిందే.

ఈ మధ్యే ‘స్పైడర్’ సినిమాతో తమిళంలోకి వెళ్లిన మహేష్ ను చూసి అక్కడి వాళ్లు కూడా వావ్ అన్నారు.

‘స్పైడర్’ ఆడియో వేడుకలో యాంకర్లు.. నటీనటులు.. సాంకేతిక నిపుణులు మహేష్ అందం గురించి ఎలా పొగిడేశారో తెలిసిందే.

అంత‌టి అందం, ట్యాలెంటు ఉన్న హీరో మ‌హేష్‌. అందుకే ప్ర‌ఖ్యాత థ‌మ్స‌ప్ బ్రాండ్ చాలా కాలంగా మ‌హేష్‌నే బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కొన‌సాగిస్తోంది.

స‌చిన్ టెండూల్క‌ర్‌, స‌ల్మాన్ రేంజ్ సెల‌బ్స్‌ను నియ‌మించుకునే థ‌మ్స‌ప్ ద‌క్షిణాదిన న‌మ్మ‌కంగా మ‌హేష్‌ని మాత్ర‌మే బ్రాండ్ ప్ర‌మోష‌న్‌కు ఉప‌యోగిస్తోంది.

బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గని అందంతో ఉంటాడు కాబట్టే అతను నటించిన థమ్సప్ ప్రకటనను దేశవ్యాప్తంగా ప్రచారానికి ఉపయోగించకుంది ఆ సంస్థ.

ఇప్పుడు మరోసారి మహేష్ బాబుతో నేషనల్ లెవెల్లో ప్రమోషన్ కోసం ఒక యాడ్ తీర్చిదిద్దుతోంది థమ్సప్ సంస్థ.

ఈ ప్రకటనలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కూడా నటించడం విశేషం. వీళ్లిద్దరి మీదా కాలిఫోర్నియాలో భారీ ఎత్తున ఈ ప్రకటన చిత్రీకరించడం విశేషం.

ప్ర‌స్తుతం ‘భరత్ అను నేను’ షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకుని వెళ్లి ఈ ప్రకటనలో నటించి వచ్చాడు మహేష్.

ఈ యాడ్‌లో మ‌హేష్ కొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. మునుప‌టి కంటే స‌న్న‌బ‌డి స్మార్ట్‌గా క‌నిపించాడు.

ఈ సందర్భంగా మహేష్ బాబు.. రణ్వీర్ తో కలిసి ఉన్న ఆన్ లొకేషన్ పిక్ ఒకటి బయటికి వచ్చింది. అందులో మహేష్ లుక్ చూసి వావ్ అంటున్నారు అతడి ఫ్యాన్స్.

ఈ మధ్య కాలంలో మహేష్ బెస్ట్ లుక్ ఇదే అనిపించేలా చాలా స్మార్ట్ గా ఉన్నాడు ప్రిన్స్ అందులో. అతను కొంచెం సన్నబడ్డట్లు కూడా కనిపిస్తున్నాడు.

ఇదే లుక్ భ‌ర‌త్ అనే నేనులోనూ క‌నిపిస్తే అభిమానుల‌కు మ‌రింత ఖుషీనివ్వ‌డం ఖాయం అని అర్థ‌మ‌వుతోంది.

అటు బాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ తో మ‌హేష్ క‌లిసి న‌టించిన థ‌మ్స‌ప్ ప్ర‌క‌ట‌న అటు ఉత్త‌రాది, ఇటు ద‌క్షిణాది రెండుచోట్లా ప్ర‌మోష‌న్‌కి క‌లిసొస్తోంది.

Share

Leave a Comment