సరికొత్త లుక్‌తో అదరగొట్టాడు

భరత్‌ అనే నేను భారీ సక్సెస్ తరువాత ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్న సూపర్‌ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేయనున్నారు మహేష్. మహేష్ బాబు కొత్త సినిమా అంటే జనాలు అందరిలోనూ ఆసక్తి ఉంటుంది.

ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఫ్యామిలీ కంటెంట్ ను అందించడంలో ఈ హీరోకు మంచి గుర్తింపు ఉంది. అలాగే ప్రయోగాలు చేయడంలో కూడా పేరుంది. కొత్త సినిమాలో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించేందుకు మేకోవర్ అవుతున్నారని ప్రచారం జరిగింది.

ఈ సినిమాలో మహేష్ గడ‍్డంతో కనిపించనున్నారన్న టాక్‌ వినిపించింది. ఇప్పటికే మహేష్‌ లుక్‌ పై నమ్రత సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చేశారు. దీంతో అప్పుడే ఈ సినిమా పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మహేష్ కొత్త మేకోవర్ లో ఎలా ఉంటారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు.

జూన్‌ పదిన జరగనున్న డబ్బింగ్ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో మహేష్ పాల్గొననున్నారట. అంతేకాదు సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న సమ్మెహనం సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు కూడా మహేష్ హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో మహేష్‌ కొత్త లుక్‌ చూసేందుకు అభిమానులు జూన్‌ 10 కోసం ఆసక్తిగా ఎదురుచూసారు.

కానీ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన మహేష్ సరికొత్త లుక్‌లో ఆకట్టుకున్నారు. ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే ప్రిన్స్ ను కెమెరా కళ్ళు వదిలిపెట్టలేదు. ఫోటోలు, వీడియోలను తీయగా మరుక్షణం అవి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యి వైరల్ అయ్యాయి.

దీంతో అఫీషియల్ గా ప్రిన్స్ ఫస్ట్ లుక్ ను చూడాలనుకున్న ఫ్యాన్స్ కు ఈ వీడియోలలో ప్రిన్స్ గడ్డంతో ఎలా ఉన్నారో తెలిసిపోయింది. ఈ వీడియోలో ప్రిన్స్ ఒక్కరే ఉన్నారు తప్ప కుటుంబ సభ్యులు కనిపించకపోవడం విశేషం. ఏది ఏమైనా ప్రిన్స్ గడ్డం లుక్ అభిమానులకు ఆనందదాయకంగా మారిందని చెప్పడంలో సందేహం లేదు.

దీంతో వంశీ పైడిపల్లి సినిమాపై అంచనాలు ఇప్పటినుండే ప్రారంభం అయ్యాయి. వచ్చే ఆదివారమే కొత్త సినిమా చిత్రీకరణలో మొదటి రోజు కానుంది. ఈ నెల 10న (ఆదివారం) డెహ్రాడూన్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

వచ్చే నెల వరకూ అక్కడే చిత్రీకరణ జరగనుందని సమాచారం. మహేష్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని అశ్వనీదత్‌, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటించనుంది.

Share

Leave a Comment