అంచనాలకి మించి..

ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో మళ్లీ మంచి రోజులు రాబోతోన్నట్టు కనిపిస్తున్నాయి. దాదాపు ఐదు నెలల పాటు ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో ఎంతో మంది ఉపాధి లేక విలవిల్లాడిపోయారు. కరోనా ఎంతకీ తగ్గకపోవడంతో చూసి చూసి సినిమా షూటింగ్స్ మొదలెట్టేశారు

అయితే పెద్ద హీరోలెవ్వరూ ఇంత వరకు సెట్‌లోకి అడుగుపెట్టి మేకప్ వేసుకోలేదు. ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలు సైతం షూటింగ్‌కు వెళ్లే ఆలోచనలే ఉన్నాయి. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ క్రమంలో మహేష్ బాబు నేడు సెట్ పైకి వచ్చాడు

కానీ అది సర్కారు వారి పాట కోసం కాదు, వాణిజ్య ప్రకటన కోసం. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఓ యాడ్ షూటింగ్‌లో మహేష్ బాబు పాల్గొన్నాడు. ఈ రోజు జరిగే షూటింగ్‌లో కూడా మహేష్ బాబు పాల్గొంటాడట

అయితే పరిమిత సంఖ్యతోనే షూటింగ్ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన ఓ లుక్ బయటికి వచ్చింది. ఇందులో సూపర్ స్టార్ లుక్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. బాబోయ్ ఏంటిలా ఉన్నాడు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు

మహేష్ బాబు లుక్ చూసిన వాళ్ళంతా స్టన్ అయిపోయారు అనే చెప్పాలి. మరీ ఇంతదంగా ఉంటే ఎలా మహేషా అంటూ అడిగేస్తున్నారు అభిమానులు కూడా. కచ్చితంగా మహేష్ కొత్త లుక్ సర్కారు వారి పాట చిత్రం కోసమే అనే టాక్ బలంగా వినిపిస్తుంది

దాంతో సర్కారు వారి పాట సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. పొడవాటి జుట్టుతో మహేష్ ఈ లుక్ లో సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు అంచనాలకి మించి మునుపటి కంటే మరింత ఫిట్ గా ఉన్నాడు కూడా

మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే మహేష్ బాబు ఏజ్ 45 ఏళ్ళు కాదు జస్ట్ 25 మాత్రమే అంటూ మిగిలిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా ఈ లుక్ తో మహేష్ తరువాతి సినిమా అయిన సర్కారు వారి పాట పై హైప్ పెంచేసాడనే చెప్పొచ్చు.

రోజు రోజుకీ మరింత కుర్రాడైపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంటున్నాడు మహేష్ బాబు. షూటింగ్స్ సమయంలో ఆయనకు పిల్లలతో గడిపే సమయం దొరకదు

అందుకే ఈ కరోనా తీసుకొచ్చిన హాలీడేస్‌ను పూర్తిగా పిల్లలకే ఇచ్చేసాడు మహేష్. ప్రస్తుతం పిల్లలు సితార, గౌతమ్‌లతో మహేష్ బాబు ఆడుకుంటున్నాడని. అలాగే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వదలకుండా చూస్తున్నాడని చెప్పింది నమ్రత

Share

Leave a Comment