24 రోజుల తరువాత

‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది మహేష్ 25వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీద‌త్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కొన్నాళ్ళుగా డెహ్ర‌డూన్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

24 రోజుల పాటు జ‌రిగిన షెడ్యూల్ పూర్తైంద‌ని చిత్ర నిర్మాణ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. భారీ షెడ్యూల్‌ పూర్తి చేసిన మహేష్‌ అండ్‌ టీం ప్రస్తుతం షార్ట్‌బ్రేక్‌ తీసుకున్నారు. బ్రేక్ త‌ర్వాత మ‌రో షెడ్యూల్ కోసం అమెరికా షూటింగ్ కోసం ఫ్లైట్ ఎక్కనున్నారా లేక ఇక్కడే షూటింగ్ జరపనున్నారా తెలియాల్సి ఉంది.

పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌5 ,2019న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ర‌వి అనే పాత్ర‌లో మ‌హేష్ క్లోజ్ ఫ్రెండ్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌.

ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇప్పటికే వర్కింగ్ స్టిల్స్ లో తన గడ్డం లుక్ తో అదరగొడ్తున్న మహేష్ బాబుని చూడాలని ఆయన ఫాన్స్ మాత్రమే కాదు, యావత్ తెలుగు వారందరూ కూడా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి విషయాలు బయటికి రాకుండా వంవంశీ పైడిపల్లి తో సహా నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చేనెల ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని బర్త్ డే విషెస్ చెబుతూ టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ బయటపెట్టాలన్నది మేకర్స్ ఆలోచనగా తెలుస్తుంది.

అయితే ఈ వార్తను అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ఇప్పటికే మహేష్ అభిమానులు ఆయన పుట్టినరోజును భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ వార్త కూడా నిజమైతే అభిమానులకు ఇంతకన్నా ఆనందం ఏముంటుంది.

Share

Leave a Comment