నెవ్వ‌ర్ గివ్ అప్ ఎవ్వ‌ర్‌!

ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరో మ‌హేష్. అత‌డి ఛరిష్మాకి బాలీవుడ్ అంద‌గ‌త్తెలు సైతం అద‌రాల్సిందే.

అందం, ట్యాలెంటు ఉన్న హీరో మ‌హేష్‌. అందుకే ప్ర‌ఖ్యాత థ‌మ్స‌ప్ బ్రాండ్ చాలా కాలంగా మ‌హేష్‌నే బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కొన‌సాగిస్తోంది.

గ‌త వారం రోజులుగా థ‌మ్స‌ప్ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ షూట్ వార్త ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్ నుంచి సూప‌ర్‌స్టార్ మ‌హేష్, బాలీవుడ్ నుంచి ర‌ణ‌వీర్ సింగ్ థ‌మ్స‌ప్ ప్ర‌మోట‌ర్స్‌గా ఉన్నారు.

ఈ ఇద్ద‌రిని క‌లిపి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఆ ఫోటోలు అంత‌ర్జాలాన్ని హీటెక్కించాయి.

ఇదిగో ఇప్పుడు ఏకంగా ప్ర‌క‌ట‌న వీడియోనే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వీడియోని మ‌హేష్ స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో ప్ర‌మోట్ చేస్తున్నాడు.

`నెవ్వ‌ర్ గివ్ అప్ ఎవ్వ‌ర్‌!` అంటూ మ‌హేష్ విసిరిన ఛాలెంజ్ ఆక‌ట్టుకుంటోంది. ఆ యాడ్ చూస్తే.. ఆ రేసింగ్ కారులో.. ఇంటర్నేషనల్ రేసు ట్రాక్ పైన..

మహేష్ ఆ డ్రైవింగ్ సీట్లో.. భలే పర్ఫెక్ట్ ఫిట్ తరహాలో ఉన్నాడు. యాడ్స్ లో మాత్రం మహేష్ రేంజే వేరు.

ఓ కార్ రేసింగ్‌లో పాల్గొన్న రేస‌ర్ మ‌హేష్ కార్ క్రాష్ అయినా.. రెండు గుట‌క‌ల థ‌మ్సప్ తాగి ల‌క్ష్యాన్ని ఎలా ఛేదించాడు?

పోటీ బ‌రిలో అంద‌రినీ వెన‌క్కి ఎలా నెట్టేశాడు? అన్న‌ది ప్ర‌క‌ట‌న‌లో చూడాల్సిందే.

మ‌హేష్ రేస‌ర్ డ్రెస్‌, లుక్ సూప‌ర్భ్ అంటూ ఇదివ‌ర‌కే అభిమానుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ యాడ్ కి అటు సినీ వర్గాలు నుంచి మంచి స్పందన వస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో యాడ్ తీసారు అని సినీవర్గాలు అనుకుంటున్నాయి.

యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో కి లక్షల సంఖ్యలలో లైక్ లు, వ్యూలు వస్తున్నాయి.దీంతో మహేష్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ మధ్య కాలంలో మహేష్ బెస్ట్ లుక్ ఇదే అనిపించేలా చాలా స్మార్ట్ గా ఉన్నాడు ప్రిన్స్. అతను కొంచెం సన్నబడ్డట్లు కూడా కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం మ‌హేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భరత్‌ అనే నేను’ (పరిశీలనలో ఉన్న టైటిల్‌).

ఇదే లుక్ భ‌ర‌త్ అనే నేనులోనూ క‌నిపిస్తే అభిమానుల‌కు మ‌రింత ఖుషీనివ్వ‌డం ఖాయం అని అర్థ‌మ‌వుతోంది.

కైరా అడ్వాణీ కథానాయిక. ఇందులో మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్‌ నెలలో విడుదల కానుంది.

Share

Leave a Comment