మహేష్ – గౌత‌మ్ పారా గ్లైడింగ్…

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే ‘భరత్ అనే నేను’ షూటింగ్ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే, ప్రస్తుతం ఆయన కొత్త సంవత్సరాన్ని తన దైన శైలి లో జరుపుకుంటున్నారు.

షూటింగ్ లతో ఎంత బిజీ గా ఉన్న కానీ తన ఫ్యామిలీ తో గడిపేందుకు ఎప్పుడు ముందుండే మహేష్. ఈ సారి తమ వెకేషన్‌కు గల్ఫ్ కంట్రీలను ఎంచుకున్నారు.

ఆయనకి కొంచెం సమయం దొరికినా పిల్లలతో హ్యాపీగా విహరిస్తుంటారు. తాజాగా ఆయన న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో కూడా తన ఫ్యామిలీతోనే గడుపుతున్నారు.

భార్య‌ న‌మ్ర‌త‌, పిల్ల‌లు గౌత‌మ్ కృష్ణ‌, సితార స‌హా ఇత‌ర‌త్రా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో క‌లిసి ఈ టూర్ ప్లాన్ చేశారు. వారి స్నేహితులతో కలిసి ఒమన్ దేశంలో గడుపుతున్నారు.

మహేష్ తన కుటుంబం తో కలిసి ఈ సారి కొంచెం డిఫరెంట్ గా కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలుకుతున్నారు. డిసర్ట్ సఫారి, విలాసవంతమైన క్రూజ్ లొ పిల్లలతో విహరిస్తూ గడిపారు.

ఇంతే కాకుండా, మహేష్ ఈ సారి మొట్టమొదటి సారిగా ‘పారా గ్లైడింగ్’ చెసారు. ఇది గౌత‌మ్ ఐడియా అని, దానికి మహేష్ నో చెప్పకుండా సరదాగ ఈ విన్యాసం చెసారు.

సాధారణంగా వెకేషన్ ఫోట్లో కనిపించడానికి మహేష్ బాబు ఇష్టపడరు. కాని ఇదిగో ఇలా న‌మ్ర‌త శిరోద్క‌ర్ గౌత‌మ్‌, మహేష్ సెల‌బ్రేష‌న్స్‌కి సంబంధించిన ఫోటోల్ని ఇన్‌స్టాగ్ర‌మ్‌లో షేర్ చేశారు.

ఇంకా మౌంటైన్ హైకింగ్, ఫిషింగ్, స్నోర్కెల్లింగ్ ట్రిప్స్ కూడా మహేష్ తన కుటుంబ సభ్యులతో చేయనున్నారు. ఈ కొత్త సంవత్సరాన్ని ఇలా అద్భుతంగా వెల్కం చెప్పనున్నారు.

మహేష్ కి ఇలా గల్ఫ్ కంట్రీ లో వెకేషన్ చేసుకోడం ఇది మొదటి సారి కాదు. ఇది వరకు పలు మార్లు ఆయన కుటుంబం తో కలిసి రాస్-అల్-కైమా కి హాలిడే ట్రిప్స్ కోసం వచ్చేవారు.

ఈ సారి కూడ అరెబియా దేశం లో కుటుంబం తో కలిసి సరదాగ టైం స్పెండ్ చేస్తున్నారు. అటు నుంచి ఫైనల్ గ అబు దాబి లో గ్రాండ్ పార్టి తో ఆయన హాలిడే ట్రిప్ ని ముగించనున్నారు.

అలా మహేష్ తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి కొత్త సంవత్సరాన్ని గ్రాండ్ గ స్వాగతం పలికి, ఈ వారం తిరిగి హైదరాబాద్ కి చేరుకోనున్నారు.

న్యూ ఇయర్ ట్రిప్ అవ్వగానే కొరటాల మూవీ లో మహేష్ జాయిన్ కాబోతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నెల 7 నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేయగా.. దాదాపుగా ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానుందని తెలుస్తోంది.

ఫిబ్రవరి/మార్చి సెకండాఫ్ నుంచి మహేష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించే ప్రణాళికలు కూడా ఉన్నాయని టాక్. దర్శకుడు వంశీ పైడిపల్లి మొత్తం స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసుకున్నారు.

Share

Leave a Comment