సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో స్టార్

తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో అపూర్వ విజయాలను, సరికొత్త సాంకేతికతలను అందించిన సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో తార తెరకు పరిచయం అవుతోంది.

గతంలో కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా పలు చిత్రాల్లో నటించగా.. ప్రస్తుతం మహేష్ బాబు సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు.

కృష్ణ కూతురు మంజుల కూడా మొదట్లో హీరోయిన్ కావాలనుకున్న ఆమె, కొన్ని కారణాల వలన ఆ దారిలో ప్రయాణం చేయలేకపోయారు. మంజుల నటిగా పరిచయం అయిన సమయంలో సూపర్ స్టార్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఆ తరువాత ఆమె అభిరుచి కలిగిన దర్శక నిర్మాతగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దర్శకురాలిగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమాతో మూడోతరం నుంచి మహేష్ తనయుడు గౌతమ్ కూడా వెండితెరకు పరిచయం అయ్యాడు.

తాజాగా మంజుల కూతురు కూడా వెండితెర మీద సందడి చేయనుంది. లోకేషన్ లో జాన్వీ సందీప్ తో షూటింగ్ లో ఉండగా తీసిన ఫొటోను కూడా ట్వీట్ చేసింది.

తన స్వీయ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన కూతురు జాన్వీ కీలక పాత్రలో నటింస్తున్నట్టుగా ప్రకటించింది మంజుల.

జాన్వి తన మొట్టమొదటి షాట్‌లోనే కెమెరా ముందు ఎంతో సహజంగా నటించిందని, జాన్విని చూస్తోంటే మహేష్ బాబు చైల్ట్ ఆర్టిస్టుగా వున్న రోజులు గుర్తొస్తున్నాయని తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారామె.

“తనను ఎప్పుడు షూట్ లోకి రానివ్వలేదు. అందుకే మొదటి సారి తను షూటింగ్ లోకి రాగానే నర్వస్ గా అనిపించింది. కానీ మొదటి సీన్ షూట్ చేసిన తర్వాత తనపై నాకు నమ్మకం పెరిగింది.

ఆమె మాత్రం చాలా సులభంగా, ఆత్మవిశ్వాసంతో నటించింది. పూర్తి సహజంగా చేసింది, అందగత్తె. తను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పటి మహేష్ ను గుర్తు చేస్తోంది.” అని మంజుల పోస్ట్‌లో పేర్కొన్నారు.

మంచి కథానాయికగా పేరు తెచ్చుకునే అవకాశం అప్పట్లో తనకి లేకపోవడంతో, తన కూతురు జాన్వీ ద్వారా ఆ కలను నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఆమె వున్నారు.

ఈ సినిమాలో సందీప్ కిషన్, అమీరా దస్తుర్, త్రిదా చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో జాన్వి ఓ ముఖ్య పాత్రలో నటించనుంది.

జెమిని కిరణ్ (ఆనంది ఇందిరా ప్రొడక్షన్స్‌ పతాకంపై) నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో ఆడియెన్స్ ముందుకు రానుంది.

Share

Leave a Comment