ముగ్గురు స్టార్స్ మరోసారి సందడి

టాలీవుడ్ లో ఈ మధ్య హీరోల ఫ్రెండ్షిప్ ని చూస్తుంటే అభిమానులకు చాలా ముచ్చటేస్తోంది. ఇంతకుముందు కూడా స్టార్ హీరోలు చాలా ఫ్రెండ్లి గా ఉండేవారు కానీ ఆ విషయాలు ఎక్కువగా బయటపడేవి కావు. సోషల్ మీడియా వాతావరణం పెరిగిపోయాక రోజు రోజుకి హీరోల స్పెషల్ మూమెంట్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోల బెస్ట్ గ్యాంగ్ ఏదైనా ఉందా అని అంటే.. అది వీరిదే అనే చెప్పాలి. కొన్ని వారాల నుండి ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ లకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు – తారక్ – రామ్ చరణ్ ఎంత క్లోజ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా ఈ స్టార్ హీరోల స్నేహం టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా వైరల్ గా మారింది. ముగ్గురు ఒక ఫ్రెమ్ లో కనిపించడం ప్రస్తుతం అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ముగ్గురు స్టార్స్ నవ్వులు చిందిస్తూ లవ్లీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ స్టార్స్ కు సంబంధించి ఏ సినిమా ఫంక్షన్ జరిగినా ఈ ముగ్గురు కలిసి ప్రేక్షకులకు కనువిందు చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.

మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ వేడుకకు ఎన్టీఆర్ గెస్టుగా హాజరు కావడం, అదే రోజు రాత్రి మహేష్ బాబు ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యారు. ఈ ముగ్గురు టాప్ స్టార్స్ మధ్య మంచి అనుబంధం ఉందిని చెప్పడానికి ఆ ఫోటోలు నిదర్శనంగా నిలిచాయి.

ఇలా చేయడం ద్వారా తమను అభిమానించే ఫ్యాన్స్, ఆడియన్స్ మధ్య కూడా ఒక హెల్దీ ఎట్మాస్పియర్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ హాలిడే లో ఉండగా.. తారక్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే రామ్ చరణ్ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు.

తన 25వ సినిమా కోసం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నారు సూపర్‌స్టార్ మహేష్‌ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించనున్నారు. జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పక్కాగా జరుగుతోంది.

విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ 25వ చిత్రంలో ప్రత్యేక లుక్‌ కోసం కసరత్తులు చేయనున్నారు మహేష్‌. ఈ లుక్‌తో ఈ సినిమా లో ఇంకా యంగ్‌గా కనిపించబోతున్నారట మన సూపర్‌స్టార్ మహేష్‌ బాబు.

Share

Leave a Comment