మా మహేష్ మారలేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ మూవీ ద్వారా ప్రముఖ నటి విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు.

చైల్డ్ ఆర్టిస్టుగా విజయశాంతితో కొడుకు దిద్దిన కాపురం మూవీలో కలిసి పని చేసిన మహేష్ బాబు దాదాపు 30 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ ఆమెతో కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ సూపర్ స్టార్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. అంతా ఇక్కడే మొదలయ్యింది. అది 1989. లొకేషన్ కొడుకు దిద్దిన కాపురం సెట్స్.

1989లో తొలిసారిగా విజయశాంతి గారిని కలిశాను. 30 సంవత్సరాల తర్వాత విజయశాంతి గారితో మళ్లీ కలిసి సరిలేరు నీకెవ్వరులో పని చేస్తున్నాను. లైఫ్ ఒక ఫుల్ సర్కిల్ తిరిగినట్లు ఉంది అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఇప్పుడు మహేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ చేసిన ఈ ట్వీట్ కు విజయశాంతి గారు జవాబిచ్చారు.

ప్రకృతి సంవత్సరాలని మారుస్తుంది, కాని మా మహేష్ బాబు గారి స్వభావాన్ని కాదు. క్యూట్‌నెస్ ఈజ్ హిజ్ క్రౌన్ ఇన్ హార్ట్ అండ్ మైండ్. 1989 లో మా కాంబినేషన్ జరగకముందు ఇదే రోజు 1980లో ఆల్ టైం సూపర్‌స్టార్ కృష్ణ గారితో కిలాడి కృష్ణుడు తో నా సినీ రంగ ప్రవేశం జరిగింది. కళ అనేది చాలా పెద్దది మరియు సర్కులర్.

నీ లాంటి వారి చుట్టూ తిరుగుతుంది. లెగసీ అనేది ప్రీషియష్ ట్రెజర్ అని ట్వీట్ చేసారు విజయశాంతి గారు. ప్రస్తుతం మహేష్ విజయశాంతిల ఈ సంభాషణ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా గా మారిపోయింది. విజయశాంతి ఈ చిత్రంతో చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇస్తుండడం అంచనాలని పెంచుతోంది. మహేష్ విజయశాంతిల కాంబినేషన్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించబోతున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో విజయశాంతి గారు అందుకు తగిన విధంగా సిద్ధం అయ్యారు. రీ ఎంట్రీపై విజయశాంతి స్పందిస్తూ 180 సినిమాలు చేశాను. నా రాజకీయ జీవితంలో 13 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ రీ ఎంట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.

మహేష్ బాబు కెరీర్‌లో 25వ సినిమాగా వచ్చిన మహర్షి రికార్డుల సునామీ సృష్టించడంతో 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు పై రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల అంచనాలు రీచ్ అయ్యేలా భారీ హంగులతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్ బాబులు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అప్పుడే భారీ మొత్తం వెచ్చించి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నారని తెలిసింది. ఇండిపెండెన్స్ డే కానుకగా సరిలేరు నీకెవ్వరు నుంచి అదిరిపోయే వీడియో రిలీజ్ చేసి మహేష్ అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది చిత్రయూనిట్.

చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ బాబు నటిస్తున్న కారణంగా ఈ పాటకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఒకరకంగా ఈ సాంగ్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. నవంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ ఆద్యంతం ప్రమోషన్స్ చేయాలన్నది ప్లాన్. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్ లోకి రానుంది.

Share

Leave a Comment