మహేష్ భారీ విరాళం..

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, సినీ, వర్తక, వాణిజ్య ప్రముఖులు ముందుకు వస్తున్నారు. భారీ వర్షాలతో అల్లాడుతున్న భాగ్యనగరం కోసం తారాలోకం కదిలివచ్చింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో బాధితుల సహాయార్థం తెలుగు చలన చిత్రసీమ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు

ప్రాణ నష్టం జరగడంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితులకు తక్షణ సాయంగా తెలంగాణ ప్రభుత్వం రూ.550 కోట్లను ప్రకటించింది. అందరూ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించే టాలీవుడ్ భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి మరోసారి ముందుకొచ్చింది

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రభుత్వానికి అండగా ఉంటానంటూ వరద బాధితులకు సహాయార్థంగా రూ. 1 కోటి రూపాయలను ప్రకటించారు. తెలంగాణలో భారీ వర్షపాతం వల్ల సంభవించిన ఈ వినాశనాన్ని మనం ఎప్పుడూ ఊహించలేదు. బాధిత కుటుంబాల్ని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టడం అభినందించాల్సిన విషయం

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంగా అందిస్తున్నా. ఈ మంచి పనిలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. ఇటువంటి కష్ట సమయంలో మనతోటి వారిని ఆదుకుందాం అని ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ మహా నగరాన్ని వర్షం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది

గత కొన్నేళ్లుగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భాగ్యనగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చెరువు కట్టలు తెగి ఇళ్ళ మధ్యలోంచి వరదలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్ల పక్కన నివాసముంటున్న ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వాళ్ల జీవితాలు నీట మునిగిపోయాయి. ప్రస్తుతం చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు మారిపోయింది పరిస్థితి

మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. క్లిష్ట సమయం‍లో ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు చిరు. జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సాయంగా రూ.50 లక్షలు అందించటానికి ముందుకు వచ్చారు. విజయ్ దేవరకొండ 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు

ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో కలిసి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి10 లక్షలు, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ చెరో 5 లక్షల రూపాయలను విరాళంగా అందించనున్నట్లు తెలిపారు. ఆపత్కాల సమయంలో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి అండగా నిలిచిన దాతలకు ట్విట్టర్ వేదికగా తెలంగాణా మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు

వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తక్షణ సాయం అందేలా చూడాలన్నారు. బాధితులందరికీ సాయం అందాలనేది సీఎం ఆలోచనా విధానమని వివరించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను పర్యవేక్షించాలని సూచించారు. ముంపునకు గురై కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి భరోసా ఇచ్చేలా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు

ప్రస్తుతం వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడంతో పాటు జీహెచ్ఎంసీ చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రెండు నెలల వేతనాన్ని సీఎం సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించారు

Share

Leave a Comment