సూపర్ లుక్స్ తో ఆపరేషన్ సక్సెస్

ఆది హీరోగా వినాయకుడు ఫేం అడివి సాయికిరణ్ రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. తాజాగా ఈ చిత్ర టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. మహర్షితో బిజీగా ఉన్నా కూడా ఆ సెట్స్ లోనే ఈ టీజర్ ను మహేష్ బాబు విడుదల చేయటం విశేషం.

ఈ సందర్భంగా ఆది, నిత్య నరేష్, సాషా ఛత్రి, పార్వతీశం, అడివి సాయికిరణ్ మహేష్ బాబు ని కలిసారు. ప్రముఖ నటుడు సాయికుమార్ గారు కూడా ఈ ఈవెట్ లో పాలుపంచుకున్నారు. మహర్షి షూట్ లో ఉండడంతో ఆ గెటప్ లోనే మహేష్ బాబు ఉన్నారు.

ఎయిర్‌టెల్ 4జీ ప్రకటనల్లో నటించాక అపారమైన క్రేజ్ సంపాదించుకుంది సాషా ఛత్రి. ఆమె హీరోయిన్ గా తొలి సినిమా చేస్తున్న తరుణం లో ఇది వరకే మహేష్‌ బాబు అంటే చాలా ఇష్టం అని, తెలుగు సినిమాలు ఎక్కువగా చూడలేదని కాని హీరోల్లో మహేష్ తో కలిసి నటించాలనుందని వెల్లడించింది.

ఇప్పుడు డైరెక్ట్ గా మహేష్ ని కలవడమే కాకుండా తన మొదటి చిత్రం యొక్క టీజర్ ని మహేష్ చేతుల మీద విడుదల చేయించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. హీరో ఆది కూడా తన ఆనందాన్ని తెలియజేసారు. మహేష్ గారి చేతుల మీద తమ సినిమా కి సంబందించిన ఈవెంట్ జరగడం తనకి చాలా స్పెషల్ అని, మహేష్ నటన తనకి ఎంతో ఇష్టం అని మరో సారి తెలిపాడు.

ఎంతమది ఉన్న గ్లామర్ విషయంలో తనను కొట్టేవారు లేరని మరోసారి ౠజువు చేసారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కొత్త హెయిర్ స్టైల్, కూలింగ్ గ్లాసెస్ తో అదరగొట్టారు. దీంతో ప్రస్తుతం ఈ ట్రైలర్ లాంచ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు కి, సాయికుమార్ గారికి మంచి అనుబంధం ఉంది. ఇది వరకు కూడా ఆది సినిమాలను తన వంతుగా ప్రమోట్ చేసారు మహేష్ బాబు. సూపర్ కూల్ సూపర్ స్టార్, మిస్టర్ హాండ్‌సమ్ అని సూపర్‌స్టార్ అభిమానులు ఈ ఫొటోలను తెగ వైరల్ చేసేస్తున్నారు.

1) దర్శకుడు సాయి కిరణ్ అడివి మరియు చిత్ర యూనిట్ సూపర్‌స్టార్ ని కలిసిన సందర్భంలో

2) హీరో ఆది, విలక్షణ నటుడు సాయి కుమార్ మరియు నిత్య నరేష్ మహేష్ తో కలిసి మాట్లడుతున్న తరుణంలో

3) హీరో ఆది ఆండ్ డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు మహేష్ తో కలిసి ఫోటో దిగిన సందర్భం

4) ఆపరేషన్ గోల్డ్ ఫిష్ టీజర్ విడుదల చేసిన మహేష్ కి ధన్యవాధాలు తెలుపుతున్న సాయి కుమార్

కాశ్మీర్ తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్. దేశభక్తి థీమ్ కాబట్టి ఈ సీజన్ లో కరెక్ట్ గా రావాల్సిన సినిమా. పోస్టర్ ని త్రివిక్రమ్ విడుదల చేయగా ఇప్పుడు టీజర్ ని సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేయడం తో ఈ చిత్రం పై చాలా క్రేజ్ పెరిగింది.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ దిల్ రాజు యూనిట్ అధికారికంగా మహర్షి రిలీజ్ ను ఏప్రిల్ 25 అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

భరత్ అనే నేను తర్వాత ఏడాది గ్యాప్ తో వస్తున్న మహేష్ బాబు సినిమా కాబట్టి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా ఇది 25వ సినిమా. కౌంట్ డౌన్ మొదలుపెట్టుకుని ఎప్పుడెప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ని మహర్షిగా చూస్తామా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. హంగామా మాములుగా ఉండదని వేరే చెప్పాలా.

మహేష్ ను వంశీ ఏ విధంగా చూపించనున్నాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. స్నేహం, కుటుంబ అనుబంధాల ఔన్నత్యాన్ని తెలియజెప్పే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్‌ బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నారు. ఎక్కడో అమెరికాలో ఉన్న రిషి ఇండియాలోని మారుమూల పల్లెటూరికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలంటే మహర్షి వచ్చే దాకా ఆగాల్సిందే.

Share

Leave a Comment