సూపర్‌స్టార్ స్పెషల్ షూట్

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 సినిమాల జర్నీ ముగిసింది. 1999 లో రాజకుమారుడిగా మొదలైన ఆయన సినీ ప్రస్థానం 2019 లో మహర్షిగా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఈ 20 ఏళ్ల కాలంలో ఎంతో మంది డైరెక్టర్లతో పనిచేసి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు టాలీవుడ్ లో నెంబర్ 1 స్టార్‌గా ఎదిగారు.

ఒక్కో జెనరేషన్ కి ఒక్కో సూపర్ స్టార్ ఉంటారు. ఆయన తెలుగులో మాత్రమే సూపర్ స్టార్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయన ఫాలోయింగ్ సౌత్ లోనే అనుకుంటే పొరపాటు. మొత్తం భారతదేశం అంతా ఆయనకు అభిమానులు ఉన్నారు. విదేశాల్లో సైతం ఊగిపోయేటంత చరిష్మా సొంతం చేసుకున్న యాక్టర్ మహేష్.

చిన్నప్పటి నుంచి మహేష్ సినిమాల్లో నటిస్తుండడంతో మనకు ఆయన ఎప్పుడూ కనిపిస్తూనే ఉన్నారు. మరి అలాంటి మహేష్ బాల నటుడి నుంచి హీరోగా మారే గ్యాప్ లో ఎలా ఉండేవాడు అన్న కుతూహలం అందరిలోనూ ఉంటుంది. రాజకుమారుడు సినిమాకు ముందు మహేష్ తో చేసిన ఫొటో షూట్ మీ కోసం.

1)

2)

3)

4)

5)

6)

7)

8)

25 వ సినిమా మహర్షి ప్రశంసలతో పాటు భారీ వసూళ్ళతో రికార్డు సృష్టించి మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. మహర్షి తో సూపర్‌స్టార్ కెరీర్ లో రెండో 100 కోట్ల షేర్ సినిమా ఖాతాలో యాడ్ అయ్యింది. ఇంతకు ముందు భరత్ అనే నేను ఈ ఘనతను సాధించిన సంగతి తెలిసిందే.

ఏదైనా సినిమా కి రోజులు పెరిగే కొద్దీ థియేటర్లు తగ్గుతూ వస్తూ ఉంటాయి. కానీ మహర్షి కి ధియేటర్లు తగ్గకపోగా కొన్ని చోట్ల ధియేటర్లను ఆరోవారంలో పెంచారు. దీని బట్టే మహర్షి సినిమాకి ప్రేక్షకులు ఏ రేంజ్ లో బహ్మరథం పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మహేష్ స్టార్ పవర్ కి మంచి కథ కూడా తోడవడంతో మహర్షి జనాల్లోకి అంతలా చొచ్చుకుపోయింది.

25వ సినిమాతో సూపర్ స్టార్ ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మహేష్ 26 వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ మరింత ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ సినిమాకు అనిల్ రావిఫూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

దిల్ రాజ్, అనిల్ సుంకర, ఘట్టమనేని మహేష్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తుండగా యంగ్ సెన్సేషన్‌ రష్మిక మందన్న మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి 2020కి అధికారికంగా విడుదల తేదీని కన్ఫర్మ్ చేసుకుంది.

Share

Leave a Comment