సంచలనానికి మరో పేరు..

పద్నాలుగు సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ చిత్రం మహీష్ కెరీర్ లొనే కాదు, తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ లో కూడా ఒక సెన్సేషన్. నిన్నగాక మొన్న చూసినట్టుంది. టీవీలో ఇవ్వాళ వచ్చినా మళ్లీ చూడాలనే అనిపిస్తుంది. ఇదంతా ఏ సినిమా గురించి అనుకుంటున్నారా?

టాలివుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేసిన పోకిరి సినిమా గురించి అండి. పూరి జగన్నాధ్ ట్రేడ్ మార్క్ డైలాగ్స్, మహీష్ బాబు మార్క్ మేనరిజం ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అది. మహీష్ కి ఒక కొత్త స్టార్ డం తీసుకొచ్చింది ఈ సినిమా. పోకిరి తోనే ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా మారిపోయారు మహీష్ బాబు.

పండుగాడు గా మాస్ రోల్ లో మహేష్ వెండితెరపై వీర విజృంభణ చేశాడు. ఇందులో మహేష్ మ్యానరిజం నుంచి డైలాగ్స్ వరకు అన్నీ కూడా జనాలకు బాగా కనెక్టయ్యాయి. ఎంతగా అంటే ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో డైలాగ్ ఇప్పటికీ సినిమాల్లో, టీవీ ప్రోగ్రాంల్లో స్పూఫ్ గా వినిపిస్తూనే ఉంటుంది.

పుష్కర కాలం పాటు జనాలు ఒక సినిమాను గుర్తుంచుకోవడం అంటే సామాన్యమైన విషయమేం కాదు. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ లో అతిపెద్ద హిట్ పోకిరియే. ఈ పద్నాలుగేళ్లలో మహేష్ గ్లామర్ అచ్చం అలాగే ఉండటం ఇంకో విశేషం.

ఈ చిత్రం షూట్ కూడా కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేసారు. మొత్తంగా 63 సెంటర్లలో 175 రోజులు ఆడింది పోకిరి. అప్పట్లో ఈ సినిమా ఒక పెను సంచలనం. కొత్త ట్రెండ్ కి నాంది పలికిన చిత్రం గా చరిత్ర లో నిలిచిపోయింది. మాస్ ఇటు క్లాస్ అని తేడా లేకుండా అన్ని సెంటర్స్ ని ఒక ఊపు ఊపేసిన చిత్రం పోకిరి.

పోకిరి బ్లాక్ టికెట్స్ అమ్ముకుని లక్షాదికారులు అయినట్టు కూడా ఆ రోజుల్లొ టాక్ ఆఫ్ థి టౌన్. అప్పటివరకు మన సౌత్ ఇండియా లో 40 కోట్లు షేర్ కలెక్ట్ చేసిన మొట్టమొదటి చిత్రం పోకిరి. కర్నూల్ లో ఒక థియేటర్లో 500+ రోజులు ఆడిందంటే ఈ సినిమా ఏ లెవెల్ లో జనలని అలరించిందో మనం ఊహించుకోవచ్చు.

తెలుగు చిత్రాలకి కొత్త మార్కెట్ ని ఓపెన్ చేసిన ఘనత కూడా మహేష్ కే దక్కుతుంది. ఈ చిత్రం యావత్తు తెలుగు ప్రేక్షకులని ఒక ఊపు ఊపి వదిలిపెట్టింది. మహేష్ పోకిరి షర్ట్స్ అన్నీ అప్పట్లో ఫ్యాషన్ గా మారిపోయాయి. యూత్ లో తిరుగులేని ఫాలోయింది సంపాదించుకున్నాడు.

మణిశర్మ నేపద్య సంగీతం చాలా పెద్ద ఎసెట్. గ్యాంగ్ డెన్ లోకి మహేష్ ఎంటర్ అవుతున్నప్పుడు ఆయన్ ఇచ్చిన గిటార్ ఇంటర్లూడ్స్ నేపద్య సంగీతం ఇప్పటికీ హైలైట్. డోలె డోలె సాంగ్ అయితే ఆ రోజుల్లో మోత మోగిపోయింది. పూరీకి టాప్ డెరైక్టర్ హోదా తెచ్చిపెట్టిన సినిమా.

ప్రతీదీ పేలింది. డైలాగ్స్ సాంగ్స్ కామెడీ ముఖ్యంగా బుల్లెట్ల లాంటి డైలాగులు ఇలా అన్నీ అదుర్స్. మాస్ సినిమా అంటే ఇలానే ఉండాలి అని కొత్త అర్ధం చెప్పిన సినిమా. ఇకపై ఇదే టెక్ట్స్ బుక్. పోకిరి లాంటి సినిమానే కావాలంటూ ఇతర హీరోల కలలు.

తెలుగు సినిమా చరిత్రలోనే పోకిరి ఓ సెన్సేషన్. పోకిరి కి వచ్చిన కలెక్షన్లు చూసి టోటల్ ఇండియన్ ఇండస్ట్రీ షాక్. ప్రతీ ఇండస్ట్రీ పోకిరి రీమేక్ చేయాలని తహతహలాడింది. తమిళంలో విజయ్‌తో, హిందీలో సల్మాన్‌ఖాన్‌తో, కన్నడంలో దర్శన్ ‌తో, బెంగాలీలో షకిబ్ ఖాన్ ‌తో రీమేక్ చేశారు.

Share

Leave a Comment