మోస్ట్ ఐకానిక్ గా చరిత్ర స్రుష్టించి

పన్నెండు సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ చిత్రం.. మహీష్ కెరీర్ లొనే కాదు, తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ లో కూడా ఒక సెన్సేషన్. ఏం చిత్రం అనుకుంటున్నారా? పోకిరి సినిమా గురించి..పూరి మార్క్ డైలాగ్స్, మహీష్ మార్క్ మేనరిజం ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అది. మహీష్ కి ఒక కొత్త స్టార్ డం తీసుకొచ్చింది ఈ సినిమా.

ఈ చిత్రం షూట్ కూడా కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేసారు. ఫస్ట్ వీక్ అంతా మిక్సెడ్ టాక్ తో నడిచి ఆ తరువాత నెమ్మదిగా పేస్ పికప్ చేసి తెలుగు చలన చిత్ర చరిత్రలో కొత్త రికార్డులని స్రుష్టించింది ఈ చిత్రం. తెలుగు చిత్రాలకి కొత్త మార్కెట్ ని ఓపెన్ చేసిన ఘనత కూడా మహేష్ కే దక్కుతుంది. ఈ చిత్రం యావత్తు తెలుగు ప్రేక్షకులని ఒక ఊపు ఊపి వదిలిపెట్టింది.

అప్పటివరకు మన సౌత్ ఇండియా లో 40 కోట్లు+ షేర్ కలెక్ట్ చేసిన మొట్టమొదటి చిత్రం పోకిరి. అంతే కాకుండా టాలివుడ్ కి మొట్టమొదటి 60 కోట్ల+ గ్రాస్ ని పరిచయం చేసాడు సూపర్ స్టార్. కర్నూల్ లో ఒక థియేటర్లో 500+ రోజులు ఆడిందంటే ఈ సినిమా ఏ లెవెల్ లో జనలని అలరించిందో మనం ఊహించుకోవచ్చు.

అప్పట్లొ ఈ సినిమా ఒక పెను సంచలనం. అటు మాస్ ఇటు క్లాస్ అని తేడా లేకుండా అన్ని సెంటర్స్ ని ఒక ఊపు ఊపేసిన చిత్రం. ఈ సినిమా బ్లాక్ టికెట్స్ అమ్ముకుని లక్షాదికారులు అయినట్టు కూడా ఆ రోజుల్లొ టాక్ ఆఫ్ థి టౌన్. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా నుండి కొన్ని అద్భుతమైన సన్నివేశాలు మీకోసం.. వీటిల్లో మీ ఫావరెట్ సీన్ ఏంటో కమెంట్స్ లో పెట్టండి.

– ఇంట్రొ విత్ వెజిటబుల్స్ – ఒన్ ఆఫ్ ఇట్స్ కైండ్.. బాక్ గ్రౌండ్ లో సుబ్బరజు వాయిస్.. ఇప్పటికీ టాలివుడ్ లో ఒన్ ఆఫ్ థి బెస్ట్ ఎంట్రీ సీన్స్ ఇది..మహేష్ అలా పరిగెట్టుకుంటూ రావడం ఆ వెనక మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం అన్ని హైలిట్స్ గా చెప్పుకోవచ్చు.

– ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు.. అన్నయ్యా షెడ్ బాగుంది..సినిమాలు చూడట్లేదేంటి..అన్నయ్యా ఎవర్తిది..ఏయ్ కొంచం తగ్గు..ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.. ఇలాంటి బాక్ టు బాక్ పంచ్ డైలాగ్స్ పేలుతూనే ఉంటాయి.

– ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా బులెట్ దిగిందా లేదా – గాంగ్స్ మద్య సెటిల్మెంట్ అవుతున్న సీన్.. మహేష్ ఆటిట్యూడ్ ఆండ్ టైమింగ్ “పది మంది ఉన్నారు ఏసేస్తే వెల్లిపోవచ్చు”, ప్యూర్ పూరి మార్క్ సీన్..మాస్ కి విపరీతంగా నచ్చే హీరో ఎలివేషన్ సీన్ ఇది.

– ధి ఐకానిక్ ట్విస్ట్ – కృష్ణ మనోహర్ IPS.. ఇండియన్ పోలీస్ సర్వీస్..57th బ్యాచ్..బాడ్జి నంబర్ 32567…ట్రెయిండ్ ఎట్ డెహ్రాడూన్…ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్ర లో ఇలంటి ట్విస్ట్ రాలేదని చెప్పొచ్చు. ఈ సీన్ అటు క్లాస్ ఇటు మాస్ అందరికి హై ఇస్తుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

– బాక్ టు బాక్ పంచ్ డైలాగ్స్.. షర్ట్ బాగుంది, ఇక్కడ సం అనేదో ఉందిరా – రివాల్వర్ నాదే..శ్రుతి నాదే..పద్మవతి హపీ ఆ? టైల్స్ ఏస్తున్నారంటగా? – ఫ్యామిలి ఫ్యామిలి ఉప్మా తిని బ్రతికేస్తుందా నానా? – లిఫ్ట్ సీన్ లో మహేష్ ఇలియాన మద్య జరిగే కాన్వర్సేషన్ – ఇవన్నీ జనాలని ఒక ఊపు ఊపేసాయి.

– ఖైరతాబాద్ హీరో..టెరిఫిక్ యాక్షన్ ఎపిసోడ్.. మహేష్ బాబు నటన నభుతో నభవిష్యత్ అనే రీతిలో లో ఉంటుంది. హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ ఇది. ఎమోషన్స్, ఇంటెన్సిటీ, అదిరిపొయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆండ్ ఫైట్ చిత్రీకరించిన విధానం సినిమాకి మేజర్ హైలైట్ గా నిలిచింది.

– మణిశర్మ మాస్టర్ క్లాస్.. ఈ చిత్రానికి పాటలు మరియు నేపద్య సంగీతం చాల పెద్ద ఎసెట్.. మణిశర్మ గారిని బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ లో కొట్టేవాల్లెవరు లేరు. గ్యాంగ్ డెన్ లోకి మహేష్ ఎంటర్ అవుతున్నప్పుడు ఆయన్ ఇచ్చిన గిటార్ ఇంటర్లూడ్స్ నేపద్య సంగీతం ఇప్పటికీ హైలైట్. డొలె డొలె సాంగ్ అయితే ఆ రొజుల్లొ మోత మోగిపోయింది.. మహేష్ పోకిరి షర్ట్స్ అన్ని అప్పట్లొ ఫ్యాషన్ గా మారిపోయాయి.

Share

Leave a Comment