కేక పెట్టిస్తున్నారు

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

మహర్షి కౌంట్ డౌన్ తో సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజు ఒక హ్యాష్‌ట్యాగ్ తో మహర్షి ని ట్రెండ్ చేస్తూ తమ ఆతురత ని తెలియజేస్తున్నారు. వాళ్ల ఎదురుచూపులకు ఊరటగా నేడు మరో కొత్త అప్డేట్ రానుంది అని సమాచారం. అదేమిటా అని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా విడుదల అయిన మూడో పాటకు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది.. పాట విడుదలయి మూడు రోజులు అవుతున్నా ఆ వీడియో ప్రోమో ఇంకా యూట్యూబ్ లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతూనే ఉంది. లక్షాలాది వ్యూస్ ఆండ్ లైక్స్ తో ఒక రేంజిలో దూసుకెల్తుంది.

ఇప్పటివరకు మొత్తనికి గాను 2.5 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది ఈ వీడియో ప్రివ్యూ. సుమారు లక్ష లైక్స్ ని కూడా సొంతం చేసుకుంది. ఇన్ని రోజులైనా ఇంకా ట్రెండింగ్ లో అలానే కొనసాగుతుండటం తో
సూపర్‌స్టార్ మహేష్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే అంటూ చక్కని బీట్‌తో సాగే ఈ పాటలో మహేష్, పూజా హెగ్డే వేసిన స్టెప్స్‌కి అభిమానులు ఫిదా అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల విడుదైలెన ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’, ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం’ పాటలకు కూడా అద్భుతైమెన స్పందన వస్తోంది.

విడుదల చేసిన పాటలు దేనికవే భిన్నమైన జానర్ కు సంబంధించినవే కావడం విశేషం. దీంతో మహర్షి లో ఒక మంచి మాస్ బీట్ ఉన్న పాట కూడా ఉంటే బావుంటుందని అభిమానుల కోరిక. మహర్షి లో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇక అందరూ ఎదురుచూస్తున్న మహర్షి టైటిల్ సాంగ్ కూడా ఉంది.

ఈ సినిమాలో మొత్తంగా ఎన్ని పాట‌లు ఉంటాయో అని సినీ ప్రేక్షకులు ఆరాటపడుతున్నారు. అతి త్వరలోనే మ‌హ‌ర్షి నుంచి ఫుల్ ఆల్బ‌మ్ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అంటే ఇంకా కొద్ది రోజులు ఓపిక పడితే
సూపర్‌స్టార్ లాండ్‌మార్కు చిత్రం మహర్షిలో ఎన్ని పాటలు అన్న సంగతి మనకు తెలుస్తుంది.

మహేష్‌ బాబు పోషించిన రిషి పాత్ర ప్రయాణమే ‘మహర్షి’ సినిమా. మనలో ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రయాణం ఉంది. ఇదీ అంతే. సినిమాలో మూడు విభిన్న కాలాలు ఉంటాయి. అందుకే, మహేష్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తారు’ అని వంశీ పైడిపల్లి ఇటివల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.

మనలోని ప్రతి ఒక్కరి కథ ఇదని, ఓ సామాన్య యువకుడు తన జీవన ప్రయాణంలో మహర్షిగా ఎలా మారాడన్నది కథ. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. చివరి వారానికి ఫైనల్ కాపీని కూడా రెడీ చేయబోతున్నారు అని వినికిడి.

ట్రైలర్ ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 9న సమ్మర్ స్పెషల్‌గా వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందరి అంచనాలను మహర్షి ఖచ్చితంగా నిలెబెడతాడు అని చిత్ర యూనిట్ చాలా కాంఫిడెంట్ గా ఉంది.

ఈ సమ్మర్ సీజన్ లో రిలీజ్ కానున్న సినిమాల్లో మహర్షి మీద ఉన్న అంచానాలు మరే ఇతర సినిమాలపై లేవు. విడుదలకు ముందే రికార్డులను సృష్టిస్తున్న మహర్షి ఇక విడుదల తరువాత ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయం అని ట్రేడ్ వర్గాల మాట. అందరి దృష్టి మహేష్ సినిమాపై ఉంది.

Share

Leave a Comment