ఆకట్టుకున్న మహా అండ్ రిషి

మహేష్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న 25వ చిత్రం మహర్షి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారానికి షూటింగ్ ను ముగించేందుకు వంశీ పైడిపల్లి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఏప్రిల్ చివరి వారంలో సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

ఇప్పటివరకు చిత్ర యూనిట్ సభ్యులు రెండు మూడు మహేష్ బాబు స్టిల్స్ ను మాత్రం విడుదల చేశారు కాని హీరోయిన్ పూజా హెగ్డే ఈ చిత్రంలో ఎలా ఉంటుందనే విషయంపై యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో మెల్లగా సినిమాలోని పాత్రలను రివీల్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే నిన్న మహేష్ పూజ కలిసున్న పిక్ ఒకటి విడుదల చేసారు.

నిన్న మహేష్ బాబు పూజా హెగ్డేల రొమాంటిక్ స్టిల్ ను విడుదల చేశారు. మహేష్ బాబు కౌగిట్లో ఒదిగి పోయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే చాలా క్యూట్ గా ఉంది. ఈ లుక్ ప్రిన్స్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చేలా ఉంది. మహేష్‌బాబు కాస్త మీసం, గెడ్డంతో మునుపటికంటే చాలా కొత్తగా కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో మహేష్ పాత్ర పేరు రిషి, అలాగే పూజా పాత్ర పేరు మహా. ప్రస్తుతం విడుదల చేసిన రొమాంటిక్ లుక్ చూస్తుంటే రిషి గుండెలో మహా.. అందుకే ‘మహర్షి’ అని అనిపిస్తోంది అని నెటిజన్స్ తమకి తోచినట్టు గెస్ వర్క్ మొదలుపెట్టేసారు.. కరెక్టుగా తెలియాలంటే ఈ సినిమా వచ్చే వరకు మనందరం వేచి చూడాల్సిందే..

ఈ పోస్టర్ చూస్తుంటే మన రిషిని ప్రేమించే అమ్మాయిగా పూజా కనిపిస్తుంది.. అందుకే పోస్టర్ లో మహేష్ ను కౌగిలించుకున్న ఆమె కళ్లు మూసి పరవశంతో ఉంది. అయితే మహేష్ మాత్రం సీరియస్ లుక్ తో కనిపిస్తున్నాడు. దాని వెనుకున్న కారణాలు ఏంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది అని అభిమానులు డిస్కస్ చేస్తున్నారు.

సినిమా టైటిల్, హీరోయిన్ పాత్ర పేరు చూస్తుంటే ఈ చిత్రంలోనూ పూజా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందనిపిస్తోంది. ప్రస్తుతం వరుస స్టార్ అవకాశాలతో సూపర్ క్రేజ్ మీద ఉన్న పూజా మహేష్ అంత అందగాడి పక్కన నటించడం ఆమెకు మరింత పాపులారిటీ తెస్తుందని చెప్పొచ్చు.

మహర్షి కోసం బల్క్ గా డేట్లను పూజా హెగ్డే ఇచ్చిందని ఈ సినిమాతో తన క్రేజ్ ఇంకా పెరుగుతుందనే నమ్మకంతో ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. చిత్ర యూనిట్ కూడా ఎంతో కాన్‌ఫిడెంట్ గా ఉన్నారు. ఈ చిత్రం లో చాలా కొత్తగా, ఎన్నడూ లేని బియర్డ్ లుక్ తో కనిపించనున్నాడు మహేష్‌. మహేష్ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం.

పొలాచ్చిలో జరిగిన పార్ట్ లో మహేష్ సరికొత్తగా కనిపించబోతున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇందుకుగాను దర్శకుడు వంశీ పైడిపల్లి భారీ సీక్వెన్స్ ప్లాన్ చేసాడట. ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. స్నేహం విలువ తెలియ‌జెప్పే క‌థ ఇది. మ‌హేష్ స్నేహితుడిగా అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఎక్కడో అమెరికాలో ఉన్న రిషి ఇండియాలోని మారుమూల పల్లెటూరికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలంటే మహర్షి వచ్చే దాకా ఆగాల్సిందే. ఈ సినిమా టీజర్ ను మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేస్తారన్న వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్‌ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసేట్టుగా ఈ టీజర్‌ ఉండనుందని సమాచారం.

టీజర్ పై అఫీషియ‌ల్ క్లారిటీ రావ‌ల‌సి ఉంది. మహర్షి తర్వాత మహేష్ బాబు సుకుమార్ తో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఇదో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని సుకుమార్ హింట్స్ ఇచ్చాడు.

సుకుమార్ మహేష్ బాబుల కాంబినేషన్ లో గతంలో వచ్చిన చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దాంతో ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ కథను సిద్దం చేశాడు. ఈ చిత్రం మే లేదా జూన్ లో పట్టాలెక్కించే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎలా సుకుమార్ తెర‌కెక్కిస్తాడ‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలా ఉంటే… అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలోనూ మ‌హేష్ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్రముఖ పాత్రికేయులు తాజాగా ఈ చిత్రానికి సంభందించిన బేసిక్ లైన్ తెలియజేస్తూ ట్వీట్స్ వేసారు.… ఇదొక క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో తెర‌కెక్క‌నుంద‌ని టాలీవుడ్ టాక్‌. ఇది కూడా చాలా కొత్తరకమైన కధగా పరిగణిస్తున్నారు.

Share

Leave a Comment