రఫ్ ఆడేసాడు..

హాలీవుడ్ కి గాడ్ ఫాధర్ బాలీవుడ్ కి సర్కార్ ఎలా ఐతే గ్యాంగ్‌స్టర్స్ గా ఆన్ స్క్రీన్ ని ఆడించారో అలాగే మన టాలీవుడ్ ని కూడా ఒకడు రఫ్ ఆడేసాడు. అతనే సూర్యా భాయ్. ది మోస్ట్ హ్యాండ్‌సమ్ చార్మింగ్ గ్యాంగ్‌స్టర్ ఆఫ్ ది వరల్డ్. అందం తో పాటు తెలివి ఉంది, తెగింపు ఉంది అతనికి.

అంతకు మించి ముంబయి ని దడదడ లాడించాడు. పోలిస్ అని చెప్పి రిచ్ కిడ్ దగ్గర మనీ తీసుకోవడం దగ్గరనుండి, ఎంపీలుగా నిలబడే వాల్లని డెసైడ్ చెయ్యడం వరకు ఎదిగాడు సూర్యా. బిజిసినెస్‌మేన్ సినిమా చూసిన ప్రతీసారి, ఇలా రెయల్ లైఫ్ లో జరుగుతుందా అని పైకి క్వచ్చన్స్ వేస్తూ లొపల మాత్రం ఊహ ఎంత బాగుంది అనుకుంటాం.

అలా ఉంటుంది ఈ సినిమా లో సూర్యా భాయ్ చేసీ ప్రతీ విషయం. ఒకే ఒక్క పంచ్‌ డైలాగ్‌తో హీరో ఇమేజ్‌ను ఎక్కడో ఆకాశాన నిలబెట్టగల పూరీజగన్నాథ్‌కు ఒక హిట్‌ కావాల్సిన సమయం అది… అప్పుడు మహేష్‌తో తిరిగి కాంబినేషన్‌ సెట్‌ అయింది. అలా వాళ్లిద్దరూ కలిసి కొడితే బాక్సాఫీస్‌ దిమ్మ మరోసారి తిరిగిపోయింది.

అప్పటివరకూ హీరోయిజం అంటే ఇదే అనుకునే అందరూ నోరు తెరిచి చూసే విధంగా హీరోయిజం ఇలా కూడా ఉంటుంది అని చాటి చెప్పారు. పూరీ విజన్ కి మహేష్ యాక్షన్ కలిసి ఈ మూవీ ని ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ సినిమా ని చేసాయి. ఈ సినిమా లో స్టోరీ ఏం పెద్ద కాంప్లికేటెడ్ గా ఉండదు, సూర్యా భాయ్ అనే క్యారెక్టర్ ఎదురుకునే పరిస్థితులు తప్ప.

సూర్యా భాయ్ గోల్ ఏంటి, దాన్ని సాధించడం కోసం ఏం చేసాడు, అసలు ఆ గోల్ కి కారణం ఏంటి? ఈ మూడు పాయింట్స్ ని కనక్ట్ చేసుకుంటూ వెల్లిపోతుంది సినిమా. కాబట్టి ఈ సినిమాకు సూర్యా భాయ్ అనే క్యారెక్టర్ ప్రాణం. అలాంటి క్యారెక్టర్ లో మహేష్ పూర్తిగా లీనం అయిపోయి నటించారు అనే చెప్పాలి.

ఎంతలా అంటే బయట ఎంతో ఫార్మల్ గా, కామ్ గా మాట్లాడే మహేష్ బాబు, ఈ సినిమా లో కొన్ని అభ్యంతకర డైలాగ్స్ (రోల్ పరంగా) కూడా మాట్లాడే అంతలా. ఎందుకంటే, అక్కడ ఉండేది మహేష్ కాదు సూర్యా భాయ్ కాబట్టి, అలా తన క్యారెక్టర్ లో 100% పరకాయ ప్రవేశం చేసి సూర్యా భాయ్ అనే క్యారెక్టర్ కు ఆటిట్యూడ్ ను ఒక సరికొత్త చిరునామా గా సెట్ చేసారు.

తమన్ పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతీ సన్నివేశాన్ని కూడా నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేస్తూ తీసుకెల్లాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా లో. సినిమా విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సూర్యా భాయ్ ఇంప్యాక్ట్ ఏదో ఒక రకంగా ఇంకా ఉందనే చెప్పాలి.

ఈ సినిమా ను పూరి గారు పైకి ఏదో గ్యాంగ్‌స్టర్ సినిమా గా కనిపించేటట్లు తీసారు కాని, సూర్య భాయ్ ద్వారా ఎన్నో నిజాలు, తనదైన బోల్డ్ వే లో చెప్పించారు. సూర్య భాయి ని ఎలివేట్ చేసే డైలాగ్స్ ఎన్ని ఉన్నాయో, తన ద్వారా చూసే జనాలను ప్రభావితం అయ్యే విదంగా చెప్పిన నిజాలు అన్నీ ఉన్నాయి.

భాయ్ లకే కొత్త అర్ధం చెప్పిన భాయ్ బిజినెస్‌మాన్ సూర్యా భాయ్. నెగటివ్ రోల్ తో కూడిన పాజిటివ్ ఎలిమెంట్స్ పుష్కలంగా చూపించిన పూరి జగన్నాథ్ మహేష్ బాబు తో చెప్పించిన డైలాగ్స్ గట్టిగా పేలాయి. ఒక కామన్ మాన్ తన హీరోయిజం చూపించి విలన్ గుండెల్లో బుల్లెట్లు దింపాడు.

బిజినెస్‌మాన్‌ సినిమా చివర్లో ఒక డైలాగ్ ఉంటుంది. నీ టార్గెట్‌ టెన్త్‌ మైల్‌ అయితే ఎయిమ్‌ ఫర్‌ ద లెవన్త్‌ మైల్‌. ఇది మహేష్‌ కెరీర్‌కు సరిగ్గా నప్పుతుంది. ఆడియన్స్‌ అంచనాలను అందుకోవడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు.

చాలాసార్లు రోటీన్‌కి భిన్నంగా వాస్తవానికి దగ్గరగా ఉండి నేరుగా ప్రేక్షకుడి గుండె తలుపును తడతాడు. ప్రేక్షకులు తన మీద చూపించిన అభిమానానికీ, చూపిన ఆదరణకీ న్యాయం చేసి… తిరిగి అంతకు మించి ఇవ్వడానికి తనలో ఒక కొత్త ఆలోచన నడుస్తూనే ఉంటుంది.

ఆ తపనకు అభినయం తోడైంది. మాస్ పర్ఫామెన్స్‌ తో పాటు ఏ పాత్రకి తగ్గట్టు దానిలోకి లీనమవడం అలవాటైపోయింది. చేపలు నీళ్లలోకి దూకినట్టు అలవోకగా సూర్యా భాయ్ పాత్రలోకి దూకేశాడు. వేసిన ప్రతి అడుగులోనూ తన ప్రత్యేకత చూపాడు. మహేష్‌ అంటే ఇదీ అని సినీప్రపంచంలో కొన్ని పేజీలను లిఖించుకుంటూనే ఉన్నాడు.

Share

Leave a Comment