ఆ సినిమా అద్భుతం : మహేష్‌ బాబు

సూపర్ స్టార్ మాహేష్ బాబు సోషల్ మీడియాలో కనిపించేది చాలా తక్కువ. ఇతర చిత్రాలు తనకు నచ్చితే తప్పకుండా వారిని ప్రశంసిస్తుంటాడు.

గతంలో అర్జున్ అర్జున్ రెడ్డి సినిమా గురించి మహేష్ స్పందించిన విషయం గురించి తెలిసిందే.

అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో రాజశేఖర్ నటించిన ‘గరుడవేగ’ సినిమా గురించి తనదైన శైలిలో సూపర్ స్టార్ ట్వీట్ చేశాడు.

ఈ సినిమాను చూసిన సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చిత్ర బృందాన్ని అభినందించారు.

గొప్ప కథ.. చక్కటి ప్రదర్శన (నటన).. తెలివైన స్క్రీన్‌ప్లే.. ‘పీఎస్‌వీ గరుడవేగ’ అద్భుతంగా ఉంది..

స్టన్నింగ్ అండ్ అమైజింగ్ వర్క్ ..టీం వర్క్ / టీం సభ్యుల కృషి అద్భుతం…

మొత్తం చిత్ర బృందం అద్భుతంగా పనిచేశారు. రాజశేఖర్‌, దర్శకుడు ప్రవీణ్‌ సత్తారుకు అభినందనలు” అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఇక రాజశేఖర్ కూడా మేహేష్ ట్వీట్ పై స్పందించాడు.

థాంక్యూ సో మచ్ డియర్ మహేష్..మా పనిని ప్రశంసించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కృషిని అభినందించడానికి కొంచెం సమయం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలని” రాజశేఖర్ స్వీట్ గా రిప్లై ఇచ్చాడు.

సూపర్ స్టార్ ట్వీట్ తో మూవీ యూనిట్ మొత్తం సంభరాలు జరుపుకుంటుంది. గ‌త వారం విడుద‌లైన “గ‌రుడ‌వేగ” వ‌సూళ్లు ఈ వారం కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయి.

ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ తో ఈ మూవీ కి ఇంకా వసూళ్లు పెరగడం ఖాయం అని భావిస్తున్నారు ట్రేడ్ వర్గాలు. మహేష్ మాట సహాయంతో కలెక్షన్స్ మరింత పెరగాలని కోరుకుందాం.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రానికి ‘భరత్‌ అనే నేను… ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో ఇటీవలే సీయం చాంబర్‌ సీన్స్‌ను కంప్లీట్‌ చేశారు. అమెరికా నుంచి మహేష్‌ రిటర్న్‌ అయిన వెంటనే నెక్ట్స్‌ షెడ్యూల్‌ పొల్లాచ్చిలో స్టార్ట్‌ కానుందట.

Share

Leave a Comment