లిటిల్ ప్రిన్సెస్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. లిటిల్ ప్రిన్సెస్ సితార ఇంతింతై అంటూ ఎదిగేస్తోంది. క్యూట్ సితారకు సామాజిక మాధ్యమాల్లో అప్పుడే బోలెడంత ఫాలోయింగ్ ఉంది. సితార లవ్ లీ ఫోటోలకు అబ్బురపడిపోవాల్సిందే. ఇటీవలే మమ్మీ డాడీతో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్లినప్పటి ఫోటోలు జోరుగా వైరల్ అయ్యాయి.

సితార అల్లరిని ఎప్పటికప్పుడు నమ్రత సామజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూనే ఉన్నారు. వీటికి ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ అంతే ఇదిగా ఉంటోంది. నేడు క్యూట్ సితార బర్త్ డే. నేటితో ఏడేళ్లు. ఈ సందర్భంగా నమ్రత ఓ ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో సితార రెయిన్ బోని తన చేతి వేళ్ల మధ్య బంధించేస్తోంది. అల్లరి సితార పుట్టిన రోజున ఇలా ఆకాశంలో రెయిన్ బో వెలయడంపై నమ్రత ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు.

జీవితం ఒక రెయిన్ బో!! సితార బర్త్ డేకి కొన్ని గంటల ముందు ఆకాశంలో ఇలా రెయిన్ బో వెలసింది. సీతా పాపకు ఏడేళ్లు.. శుభాకాంక్షలు చెబుదామా అని వ్యాఖ్యానించారు నమ్రత. ఇన్ లవ్ విత్ కశ్మీర్ అంటూ హింట్ కూడా ఇచ్చారు. అంటే మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ స్పాట్ కశ్మీర్ వద్దకు వెళ్లారన్నమాట.

శిల్పా శిరోద్కర్ సైతం సితారకు శుభాకాంక్షలు తెలిపారు. మై సితార.. బ్లెస్సింగ్స్ టు మై బేబి.. ఈరోజే కాదు ప్రతిరోజూ.. అంటూ లవ్ ఈమోజీల్ని షేర్ చేశారు శిల్పా శిరోద్కర్. గత ఏళ్ళుగా సితార పుట్టిన రోజును కుటుంబ సభ్యులు ఎలా జరిపారో మరోసారి గుర్తుచేసుకుంటూ సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.

1)

2)

3)

4)

5)

6)

7)

8)

9)

10)

ఇక ఇటీవ‌ల సొంతంగా యూట్యూబ్ లో ఓ చానల్ కూడా ప్రారంభించింది సితార. తన ఫ్రెండ్ తో కలిసి A&S అనే పేరుతో చానల్ ను ప్రారంభించారు సితార. ఇందులో A అంటే ఆద్య. ఈ అమ్మాయి ఎవరో కాదు దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె. S అంటే సితార. ఆద్య, సితార మంచి ఫ్రెండ్స్ కావడంతో తమ పేర్లలోని మొదటి అక్షరాలతో A&S యూట్యూబ్ చానల్ ఆరంభించారు.

మొదటి వీడియోగా 3 మార్కర్స్ చాలెంజ్ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. వారానికి ఓ వీడియో షేర్ చేస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తాన‌ని సితార తెలిపింది. ఈ రోజు సితార బ‌ర్త్ డే కావ‌డంతో ఇటు అభిమానులు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సితార‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌హేష్ ఫ్యాన్స్ సితార పేరుతో అన్న‌దానం, ర‌క్త‌దానంతో పాటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

Share

Leave a Comment