మహేష్ ఎలా అదరగొట్టాడో చూడండి

సూపర్ స్టార్ మహేష్ బాబు భారతదేశంలోని చాలా ముఖ్యమైన బ్రాండ్‌లకు అంబాసడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు… ఇదొక పేరు కాదు… ఇట్స్ ఏ బ్రాండ్… అన్న టాక్ ఇప్పటికే కార్పొరేట్ రంగంలో నెలకొంది.

జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో టాప్‌లో ఉన్న కంపెనీలన్నీ రీజనల్‌ స్థాయికి వచ్చే సరికి తెలుగు మార్కెట్‌ కోసం సూపర్ స్టార్ మహేష్‌ వద్దకే వస్తున్నాయి.

సినిమాల‌తో పాటు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప‌లు సంస్థ‌లకు వ్య‌వ‌హ‌రిస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చాలా బిజీ. ప్రోటీన్ సంబంధిత ఉత్పత్తి అయిన ‘ప్రొటీనెక్స్’కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఆయ‌న సంత‌కం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ప్రొటీనెక్స్ సంస్థ సూపర్ స్టార్ మహేష్ నటించిన తమ యాడ్ ను యూట్యూబ్ లో విడుదల చేసింది. ఆ యాడ్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి.

ఎప్పటిలా యాడ్ లో సూపర్ స్టార్ మహేష్ అదరగొట్టాడనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్ లో మనం ఆక్టివ్ గా ఉండాలంటే ప్రోటీన్ అవసరం చాలా ఉంది. అందుకే నేను నా డైలీ డైట్ లో సరిపడా ప్రోటీన్ ఉండేలా చూసుకుంటాను. దానికోసం ప్రోటినేక్స్ నాకు దోహద పడుతుంది అంటున్నారు మహేష్.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

బుక్ మై షో, ఈజీ మూవీస్, టికెట్ న్యూ పోర్టల్ ఏదైనా ఎక్కడా మొదటి రోజుకి టికెట్స్ అందుబాటులో లేవు. భరత్ అనే నేను టికెట్స్ హాట్ కేకులనే చెప్పాలి.

మహేష్ చేస్తున్న తొలి పొలిటికల్ మూవీ భరత్ అనే నేను. ఇందులో మహేష్ బాబు సరికొత్త పెర్ఫార్మెన్స్ చూడబోతున్నామని, ఆయన కెరీర్లోనే ది బెస్ట్ అనే విధంగా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాడని నిర్మాత దానయ్య తెలిపారు.

Share

Leave a Comment