దటీజ్ సూప‌ర్ స్టార్ మహేష్

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు మంచి టాక్ రావాలే కానీ వసూళ్ల మోత మామూలుగా ఉండదు. అది ‘భరత్ అనే నేను’తో మరోసారి రుజువైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

విశేషం ఏంటంటే ఈ చిత్రం కేవలం ఒక్క థియేటర్లోనే కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది. అది కూడా హైదరాబాద్ లో కూడా కాదు, విశాఖపట్నంలో. ఈ నగరంలోని సంగం థియేటర్లో ‘భరత్ అనే నేను’ ఇరవై ఐదు రోజుల వ్యవధిలో కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయడం విశేషం.

విజయవాడ నగరంలోని క్యాపిటల్ సినిమాస్‌లో ‘భరత్ అనే నేను’ పది రోజుల వ్యవధిలో కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ‘బాహుబలి-2’ తర్వాత అక్కడ మరే సినిమా కూడా ఈ మార్కును అందుకోలేదు. నిజంగా ఇది గొప్ప రికార్డే. కేవలం ఒక్క థియేటర్లో అది కూడా 10 రోజుల్లో కోటి కి పైగా వసూళ్ళు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.

రికార్డుల పరంగా చెప్పుకునే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా రికార్డ్ నెలకొల్పింది భరత్ అనే నేను. ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు ఈ చిత్రం క్రాస్ రోడ్స్ థియేటర్లలో రూ.1 కోటి గ్రాస్ ను వసూలు చేసింది. ఈ ఘనత సాదించడం సూపర్ స్టార్ కి కొత్తేమీ కాదు. 13 రోజులకే కోటి మ్యాజికల్ ఫిగర్ ను అందుకుని సూప‌ర్ స్టార్ కెరీర్లో ఏడవ చిత్రంగా ‘భరత్ అనే నేను’ నిలిచింది. టాలీవుడ్ లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ మాత్రమే.

ఈ చిత్రం ఏపిలోని చాలా ఏరియాల్లో కోటి రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఎక్కడెక్కడ కోటి రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసిందో మీరు కూడా చూడండి. విజయనగరం, విశాఖపట్టణం, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, ఏలురు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు లలో కోటి రూపాయలను వసూలు చేసింది భరత్ అనే నేను.

భరత్ అనే నేను తో సరికొత్త ప్రదేశాల్లో కూడా తన స్టార్ డం ని సూప‌ర్ స్టార్ విస్తరిస్తున్నాడు. కేరళలో ఏ తెలుగు చిత్రం కు సాధ్యం కాని రీతిలో కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు భరత్. కేరళలో పది రోజులకే 1 మిలియన్ రాబట్టి హయ్యస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది భరత్ అనే నేను.

మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ జూన్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం డైరక్టర్ వంశీ పైడిపల్లి, కెమెరామెన్ కేయూ మోహనన్ తో కలిసి న్యూ యార్క్ కి వెళ్లి అక్కడ అందమైన లొకేషన్స్ ని సెలక్ట్ చేశారు.

Share

Leave a Comment