మ‌రోసారి అండ‌గా మ‌హేష్..

సూపర్ స్టార్ సేవా గుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రీల్ లైఫ్‌ లోనే కాదు రియ‌ల్ లైఫ్‌ లోను హీరోనే. కొన్నాళ్లుగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ, అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు వైద్యం కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు మ‌హేష్

ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి హెల్త్ చెకప్స్ నిర్వహిస్తూ చిన్నారులకు గుండె సంబంధిత సర్జరీలను చేయిస్తూ వారి మొహాల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇప్పటివరకు గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న 1010 మంది చిన్నారులకు ప్రాణదానం చేశారు మహేష్

అయితే మరోసారి ఓ చిన్నారికి అండగా నిలిచి ప్రాణాలు కాపాడారు మహేష్. ఆంధ్రప్రదేశ్ కు చెందిన డింపుల్ అనే చిన్నారి కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. దీనితో ఆ చిన్నారి ఆపరేషన్ కు కావలసిన సాయాన్ని అందజేశారు

ముందుగా ఆ చిన్నారి గుండెకు సంబందించిన వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆ తరువాత ఈ అరుదైన వ్యాధి కూడా తోడయ్యింది. దీనితో ఆపరేషన్ కోసం ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి మహేష్ అండగా నిలిచాడు

డింపుల్ వైద్య ఖర్చులన్నీ మహేష్ బాబు భరించారు. ట్రీట్మెంట్ కూడా జరిగిందని, ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం మెరుగు పడిందని, ఈ విషయాన్ని మీతో పంచుకోవడడం ఆనందంగా ఉందని నమ్రత ఈ సందర్భంగా ట్వీట్ చేశారు

అలాగే ఆ చిన్నారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని తమ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని నమ్రత పేర్కొంది. ఇక ఆపదలో ఉన్న చిన్నారికి మహేష్ సాయం అందించడంతో అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను బ్రతికించడానికి మహేష్ ముందుకొచ్చి వారి పాలిట దేవుడిగా మారాడని ఆయన నిజమైన హీరో అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇలా మహేష్ బాబు మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు

ఇంక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది

దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ బాబు దీనితో ఇంకో హ్యాట్రిక్ కు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా సర్కారు వారి పాట చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి

Share

Leave a Comment