సూపర్ స్టార్ vs సూపర్ స్టార్ ?

తమిళ సూపర్ స్టార్ రజనికాంత్ నూతన చిత్రం 2.0 చిత్ర దర్శకుడు శంకర్, చిత్రం లో కంప్యూటర్ గ్రాఫిక్స్ కి చాలా ప్రాధాన్యత ఉండడంతో సిజి వర్క్ కే ఎక్కువ సమయం కావలసి ఉండడం వల్ల విడుదల మరింత ఆలస్యం అవుతుందని ఆయన ఇదివరకు చెప్పడం విన్నాం.

అయితే హఠాత్తుగా రజని నటిస్తున్న మరొక చిత్రం ‘కాలా’ ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 27న విడుదలవుతున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 27న విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాత దానయ్య భావిస్తున్నట్లు వార్త అందుతోంది.

భరత్ అనే నేను సినిమాను ఏప్రిల్ 27కే విడుదల చేసే లక్ష్యంతో.. చకచకా షూటింగ్ చేసేస్తున్నారు చిత్ర యూనిట్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరిగిపోతున్నాయి.

షూటింగ్ వర్క్ మొత్తాన్ని మర్చి 27కి కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఏప్రిల్ 27న సినిమా రిలీజ్. రిలీజ్ డేట్‌కి, షూటింగ్ కంప్లీట్ డేట్‌కి మధ్య ఒక నెల గ్యాప్ ఉంది.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ప్రాబ్లమ్ ఉండదు. ‘భరత్ అనే నేను’ టీమ్ ప్లానింగ్ ఇది. షూటింగ్ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే పబ్లిసిటీ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు.

యూకేలో కొన్ని అద్భుతమైన లొకేషన్స్ ఎంపిక పూర్తయిందని.. త్వరలోనే మహేష్ అండ్ టీం లండన్ బయల్దేరనున్నారని తెలుస్తోంది. ఈ పాట ఒక్కటి కంప్లీట్ చేస్తే..

ఇక ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ ఏమీ ఉండదని అంటున్నారు. దాదాపు 2 నెలలకు ముందే సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేయడం విశేషం.

అదే జరిగితే రజనికాంత్ వర్సెస్ మహేష్ బాబు అవుతుందని, అయితే అలాంటి పరిస్థితుల్లో ఇద్దరికీ కొంతమేర థియేటర్ ల కొరత సమస్య రాక తప్పదని అంతా భావిస్తున్నారు.

కాని వేసవి సెలవలు కావడంతో ఆ సమయంలో విడుదల చేస్తే సినిమాకు ఏమాత్రం కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు అదిరిపోతాయని ఇరుచిత్రాల నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

భరత్ అనే నేను సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్ కు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యాపారంలో మహేష్ బాబు క్రేజ్‌ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది.

పొలిటికల్‌ డ్రామా మేళవించిన యాక్షన్‌/ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌ కథతో ఈ సినిమా ఉంటుంది. మహేష్‌ కనిపించే విధానం, ఆయన నటన ప్రత్యేకంగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది.

ప్రస్తుతం రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు, సమాజంలో తలెత్తుతున్న అనేక అరాచకాలపై హీరో ఫైట్‌ చేస్తాడనే సమాచారం చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

Share

Leave a Comment