మహేష్ తో రామ్ చరణ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో సంక్రాంతి, దీపావళి తో పాటు ప్రతి ఏడాది క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి. మహేష్ భార్య నమ్రత ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి క్రిస్టమస్ ని సెలెబ్రేట్ చేసుకోవడం ఆనవాయితి.

మహేష్ బాబుతో పాటు రామ్ చరణ్ ఫ్యామిలీ కూడా క్రిస్మస్ సంబరాల్లో మునిగితేలారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మహేష్, రామ్ చరణ్ ఫ్యామిలీల మధ్య ఉన్న అనుభందం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిరువురు కలిసి సంబరాలు చేసుకోడం చూసి అభిమానులు ఆనందంగా ఉన్నారు.

మహేష్ బాబు, రామ్ చరణ్ మంచి స్నేహితులు. ఈ ఇద్దరు హీరోలు తమ కుటుంబాలతో కలిసి ఫారెన్ ట్రిప్ లకు వెళ్తుంటారు. కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. మహేష్ కూతురు సితారని చరణ్ భార్య ఉపాసన ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. మై లవ్, మై బెస్ట్ ఫ్రెండ్ అని సితార ని సంబోదిస్తూ సోషల్ మీడియా లో తనతో దిగిన ఫోటోలను షేర్ చేసుకుంటారు.

సెలబ్రిటీలు ఫ్యామిలీస్‌ సహా కలిస్తే చూసేవారికి కన్నుల పండుగలా ఉంటుంది. ఇక అది స్టార్ హీరోలు కలిస్తే అభిమానులకు పండుగే. గత రాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో స్టార్ హీరోలు ఫ్యామిలీస్‌ సహా కలిసి సందడి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత, ఆయన కుమార్తె సితార, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన అంతా కలిసి గత రాత్రి క్రిస్మస్ వేడుకల్లో సందడి చేశారు.

అంతా కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. ఆ ఫోటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసారు. ముఖ్యంగా ఉపాసన.. మహేష్ కూతురు సితారతో కలిసి దిగిన పిక్ బాగా ఆకట్టుకుంటోంది. ఈ పిక్స్‌ను ఉపాసన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇలా మహేష్, చెర్రీ ఫ్యామిలీస్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానుల ఆనందానికి అంతు లేదు.

‘లేటుగా చెప్పినా (క్రిస్మస్ విషెస్).. కన్నుల పండుగలాంటి ట్వీట్‌ను పోస్ట్ చేశారు థాంక్యూ’ అంటూ అభిమానులు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. చెర్రీ, మహేష్ కలిసి ఉన్న ఫోటోను ‘పిక్ ఆఫ్ ది డే’గా అభివర్ణిస్తూ అటు మెగా, ఇటు సూపర్‌స్టార్ మహేష్ అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.

అలాగే మహేష్ చరణ్ లు ఇద్దరూ తమ అభిమానులందరికీ క్రిస్ మస్ శుభాకాంక్షలు తెలిపారు. నేడు క్రిస్మస్ పండగ జరుపుకుంటున్న అందరి జీవితాల్లో వెలుగు నిండాలని ఆకాంక్షిస్తున్నాను. మ్యాజికల్ బ్లిస్ ఫుల్ క్రిస్మస్.. ప్రేమాప్యాయతలతో అందరూ బావుండాలి అంటూ విష్ చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరోల బెస్ట్ గ్యాంగ్ ఏదైనా ఉందా అని అంటే.. అది మహేష్-చరణ్ దే అనే చెప్పాలి. వీరు ఎంత క్లోజ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. మేమంతా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం. మేము కలిసికట్టుగానే పనిచేస్తాం. మా సినిమాల ద్వారా లాభాలొస్తే అది పరిశ్రమ బాగుకే ఉపయోగపడుతుంది అని ఇద్దరూ అనేక మారు తెలియజేసిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు సతీమని నమ్రత మంచి హోమ్ మేకర్ అనే చెప్పాలి. పిల్లలకు ఎంజాయ్ మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు, భక్తి శ్రద్ధలను కూడా అలవరుస్తున్నారు నమ్రత. కుల మతాలకు అతీతంగా ఇంట్లో అన్ని పండగలు జరుపుతారు నమ్రత. గత ఏడాది ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టి ఆ సందర్భంగా బుల్లి సితార శాంటా క్లాస్ లా తయారైదిగిన ఫొటోలు అభిమానులకు ఇంకా గుర్తు ఉండే ఉంటాయి.

వినాయక చవితి, దసరా, దీపావళి తదితర పండగలను మహేష్ బాబు ఫ్యామిలీ ఘనంగా జరుపుతారన్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంట క్రిస్మస్ సందడి కూడా మామూలుగా ఉండదు. పిల్లలకు అన్ని రకాల పండగల మీద అవగాహన కల్పించడానికే మహేష్, నమ్రత ఇలా ఇంట్లో ప్రతి పండగ జరుపుతుంటారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

స్టార్‌ హీరోస్‌ని స్క్రీన్‌ మీద ఎంత సేపు చూసినా అభిమానులకు తనివి తీరదు. ఒకే టికెట్‌ మీద రకరకాల షేడ్స్‌ ఉన్న పాత్రలో అభిమాన హీరోని చూస్తే? ఫ్యాన్స్‌కి పండగే. ప్రస్తుతం సూపర్ స్టార్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు అలాంటి ట్రీట్‌నే దర్శకుడు వంశీ పైడిపల్లి ప్లాన్‌ చేశారు అని టాక్.

ఈ సినిమాలో మహేష్ బాబు కాలేజ్‌ స్టూడెంట్‌గా కనిపిస్తారన్న సంగతి టీజర్ ద్వారా అందరికీ తెలిసిపోయింది. కధ ప్రకారం బిజినెస్ మాన్ గా కూడా కనిపించనున్నారు మహేష్. తాజాగా నిర్మాణ రంగంలోనూ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనుకుంటున్నారట. అందులో భాగంగానే వెబ్‌ సిరీస్‌లు, చిన్న బడ్జెట్‌ సినిమాలను నిర్మించాలనుకుంటున్నారట మహేష్.

జనవరి నుంచి మహేష్ నిర్మించే వెబ్‌ సిరీస్‌ స్టార్ట్‌ కానుందని టాక్‌. మరోపక్క రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలైన తరువాత చరణ్ పూర్తిగా రాజమౌళి చిత్రానికే సమయం కేటాయించనున్నాడు.

Share

Leave a Comment