మహేష్ తో కలిసి రణవీర్ సరదాగ…

మ‌హేష్ బాబు ప్ర‌ముఖ కూల్ డ్రింక్ సంస్థ కోకోకోలాకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నారు.. ఈ సంస్థ ఉత్ప‌త్తి థ‌మ్స్ అప్ కోసం ఇప్ప‌టికే అనేక ప్ర‌చార చిత్రాల‌లో న‌టించాడు..

తాజ‌గా మ‌రో కొత్త థమ్స్ అప్ యాడ్ కోసం గత నెలలో అమెరికా లోని లాస్ వేగాస్ షూటింగ్ లో పాల్గోన్నాడు. ఈ షూట్ కోసం భారీ ఏర్పాట్లు చేసారు అని అప్పట్లో విన్నాము.

సూపర్ స్టార్ నటించిన లేటెస్ట్ థమ్స్ అప్ యాడ్ టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది. ‘చార్జెడ్’ అనే పెరు తో రిలీజ్ చేయబడిన ఈ యాడ్ టీజర్ కి ‘టేక్ చార్జ్’ అనే హాష్ టాగ్ జతపరిచారు.

అమెరికా లో భారి యెత్తున షూట్ చేసిన ఈ యాడ్ అద్భుతమైన విన్యాసాలతో అభిమానులను అలరించనుంది అని సమాచారం.

యాడ్ టీజర్ లో మహేష్ చెప్పిన డైలాగ్ “ఇది నేను ఫినిష్ చెయ్యాలి” కి విశేష స్పందన లభించింది.

అలాగే నేడు విడుదలయిన మహేష్, రణవీర్ యాడ్ షూట్ సమయంలో తీసుకున్న ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

హిందీ వెర్షన్ లో యాక్ట్ చేసిన రణవీర్ మరియు తెలుగు వెర్షన్ లో యాక్ట్ చేసిన మహేష్ ఇద్దరు కలిసి ఫొటో కోసం సరదాగ ఫోజ్ ఇచ్చారు.

వీళ్లిద్దరూ మంచి స్నేహితులు, ఇలా ఇద్దరూ కలిసి ఫోజ్ ఇవ్వడం తో అటు నార్త్ ఇటు సౌత్ లో మహేష్, రణవీర్ అభిమానులకు కనుల పండగగా వుంది.

థమ్స్ అప్ యాడ్ ప్రచారకర్తగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఉండేవాడు. కాని ఈ మధ్య ఆయన్ని తొలగించి యూత్ లో ఉన్న క్రేజ్ కారణంగా రణవీర్ ని ప్రచారకర్తగా నియమించారు.

కాని తెలుగు లో మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు గారే థమ్స్ అప్ ప్రచారకర్తగా ఉన్నారు. తెలుగు రాష్త్రాలలో ఆయన క్రేజ్ అలాంటిది.

మహేష్ యాడ్స్ లో కూడా సూపర్ స్టార్ అన్న విషయం తెలిసిందే. మరి ఈ థ‌మ్స్ అప్ యాడ్ ఫుల్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటె కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం మహేష్ నటిస్తున్న భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్‌ కనిపించే విధానం, ఆయన నటన ప్రత్యేకంగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది.

ప్రస్తుతం రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు, సమాజంలో తలెత్తుతున్న అనేక అరాచకాల పై హీరో ఫైట్‌ చేస్తాడనే సమాచారం చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

అభిమానుల అంచనాల ప్రకారమే ఎక్కడా తగ్గకుండా గ్రాండ్ గా సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల.

– రామ్ సుభాష్

Share

Leave a Comment