ఆ రోజు దేవుడే కాపాడాలి

ఈ యేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్‌లో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎడంతో పాటుగా తెలుగు రాష్ట్రాలలో బాహుబలి2 తరువాత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది.

ఈ సినిమా సక్సెస్ తర్వాత మహేష్ బాబు కుటుంబంతో కలిసి విదేశీవిహారానికి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నారు. మహేష్ బాబు ప్రత్యేకంగా ఒక పార్టీ అంటూ ఎప్పుడు కూడా సపోర్ట్ చేసింది లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటూనే తన వంతు సేవను ప్రజలకు అందిస్తూ ఉంటారు.

పలు సేవా కార్యక్రమాలు చేసి గొప్ప మనసున్న హీరో అనిపించుకున్నారు మహేష్. భరత్ అనే నేను సినిమాలో సూపర్‌స్టార్ ని ముఖ్యమంత్రి గెటప్‌లో చూసాం. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అని కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా అది. అలాంటిది మహేష్ నిజంగానే ముఖ్యమంత్రి అయితే? మహేష్ బాబు సీఎం ఏంటి? అసలు ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు అని చాలా సార్లు చెప్పారు.

అలాంటిది ఆయన సీఎం ఎందుకు అవుతారు అనేగా మీ సందేహం. తాజాగా మహేష్ బాబు రీసెంట్‌గా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్న ఇది. ఆ ప్రశ్నకు మహేష్ బాబు చాలా తెలివిగా తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇంతకు ఆ ప్రశ్న ఏంటీ అంటే మీరు కనుక ఒక్క రోజు సీఎం అయితే మొదటగా చేసే పని ఏంటీ, ఎందుకు మీరు ఆ పని చేయాలనుకుంటున్నారు?

ఈ ప్రశ్నకు మహేష్ బాబు తనదైన శైలిలో ఫన్నీగా రిప్లై ఇచ్చారు. నేను ఒక్క రోజు సీఎం అయితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆరోజున రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి అని చమత్కరించారు. మహేష్ బాబుకు ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టైల్, ట్రెండ్ ఉన్నాయి. మరి అంతటి స్టార్‌డం సంపాదించుకున్న మహేష్ జీవితంపై ఓ బయోపిక్ వస్తే బాగుంటుంది అని తప్పకుండా ఆశిస్తారు.

ఒకవేళ మీ బయోపిక్ తెరకెక్కితే మీ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది? అని అడిగితే నాది చాలా సింపుల్, బోరింగ్ లైఫ్. నా బయోపిక్ వర్కవుట్ అవదని మహేష్ సమాధానమిచ్చాడు. మీ జీవితంలో ఓ అభిమాని చేసిన పని ఎప్పటికీ గుర్తుండిపోయేది ఏంటి అని ప్రశ్నించగా, కొన్నేళ్ల క్రితం ఓ అభిమాని నాకో లెటర్ పంపించాడు. అది ఓపెన్ చేస్తే బ్లడ్ తో నా పేరు రాసి ఉంది.

అది ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అని తెలిపారు మహేష్ బాబు. మీ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే, యంగ్ గా ఉన్న మహేష్ బాబుకు మీరు ఏదైనా చెప్పాలని అనుకుంటే అని ప్రశ్నించగా, వినయం, వినయం, వినయం ఇవే మూడు ముక్కలు అంటూ యంగ్ మహేష్ బాబు అంటే అది నా కొడుకే సో నీ తండ్రిలా ఉండు అని చెప్తా అని నవ్వుతూ జవాబిచ్చారు మహేష్.

భరత్ అనే నేను సినిమా నుంచి మొన్న విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు మహేష్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చారు. అందుకే చేయబోయే ప్రతీ సినిమాను ఆచి తూచి ఎంపిక చేసుకుంటున్నారు మహేష్. మహేష్‌కు మహర్షిలాంటి బ్యూటిఫుల్ సినిమాను కానుకగా ఇచ్చారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అందుకే ఇప్పుడు మరోసారి ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు మహేష్‌. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.

Share

Leave a Comment