సొసైటీకి సైనికుడట

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ తో బిజీగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

భరత్ అనే నేను మూవీలో యంగ్ సీఎం గా చేసిన మహేష్, మహర్షి మూవీలో బిజినెస్ మెన్ పాత్ర చేయడం జరిగింది. ఇక తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహర్షి తరువాత మహేష్ చేస్తున్న సినిమా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అంచనాలకి తగ్గకుండా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.

సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ ఆఫ్ డ్యూటీ లో కూడా ఆర్మీ ప్యాంట్స్ లో కనిపిస్తున్నారు. ఐతే బోర్డర్ ఆవల ఉన్న శత్రువుల కంటే కూడా మన సొసైటీలో ఉంటూ ఇతరులకు కీడు చేసేవారు చాలా డేంజర్. వారిని వేటాడటమే నా పని అన్నట్లుగా మహేష్ రోల్ సాగుతుందట. ఈ మూవీ సీరియస్ నోట్ లో సాగుతూనే అనిల్ రావిపూడి మార్కు కామెడీ తో అలరిస్తుందట.

సరిలేరు నీకెవ్వరు అన్నట్లుగా అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరించే విధంగా ఈ చిత్రంలోని మహేష్ పాత్ర ఉంటుందట. ఊతపదాలు, కామెడీ పంచ్ లతో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కామెడీకి కామెడీ యాక్షన్ కు యాక్షన్ గా దర్శకుడు అనిల్ రావిపూడి మలుస్తున్నాడట. అదిరిపోయే ఊతపదంతో అనిల్ రావిపూడి అద్భుతమైన హాస్యం క్రియేట్ చేస్తున్నట్టు టాక్.

పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే క్యూరియాసిటీ నెలకొంది. సరిలేరు నీకెవ్వరు తాజా షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్లో ఒక సీక్వెన్స్ చిత్రీకరణ జరిపారు.

ఆ సీక్వెన్స్ పూర్తయిన తర్వాత నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. ఆ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో మహేష్ బాబు, రష్మిక, విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, రఘుబాబు, హరితేజ తదితరులు ఉన్నారు. ఇక నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు అనిల్ రావిపూడి, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా ప్లాట్ ఫామ్ పై నిలుచుని ఉన్నారు.

అందరూ చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజు ఇవ్వడం విశేషం. ఈ ఫోటోలో మహేష్ మిలిటరీ గ్రీన్ ప్యాంట్, టీ షర్టు ధరించి ఎప్పటిలాగే హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఈ గ్రూప్ ఫోటో చూస్తుంటే సరిలేరు టీమ్ షూటింగ్ ఎంత సరదాగా సాగుతోందో మనం అర్థం చేసుకోవచ్చు. చిత్ర టీమ్ సమాచారం మేరకు ఇప్పటివరకు వచ్చిన ఔట్ పుట్ చాలా బాగుందని తెలుస్తోంది.

వరస హిట్లతో జోరు మీదున్న అనిల్ రావిపూడి తొలిసారిగా మహేష్ బాబును డైరెక్ట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టాలని పక్కాగా స్క్రిప్ట్‌ను తయారు చేసుకుని సరిలేరు నీకెవ్వరు తెరకెక్కిస్తున్నారు. ఫుల్ కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్టైనర్, ప్రేక్షకులకు పండగ ట్రీట్ ఖాయం అంటూ ఇప్పటికే అనిల్ చెప్తూ ఉండడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

మరో వైపు రిలీజ్‌‌కు కూడా ఇబ్బంది ఏర్పడకుండా పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తూ ఎక్కడా అనవసరమైన బ్రేక్స్ రాకుండా చూసుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల అయిన తరువాత సరిలేరు నీకెవ్వరు ఇంకెన్ని సంచలనాలు సృష్టించనుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వేచిచూడాల్సిందే.

Share

Leave a Comment