మహేష్ ‘రఫ్’ లుక్ అదిరిందిగా….

తెలుగు సినిమాల్లో ఆల్ టైం అందగాళ్లలో మహేష్ బాబు ఒకడు. బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని అందంతో మురిపిస్తుంటాడు మహేష్.

అత‌డి ఛరిష్మాకి బాలీవుడ్ అంద‌గ‌త్తెలు సైతం అద‌రాల్సిందే. ఈ మధ్యే ‘స్పైడర్’ సినిమాతో తమిళంలోకి వెళ్లిన మహేష్ ను చూసి అక్కడి వాళ్లు కూడా వావ్ అన్నారు.

40 ప్లస్ లోనూ కుర్రాడిలా కనిపించడం అతడికే చెల్లింది. ఎప్పటికప్పుడు మహేష్ అందం పెరుగుతుంటుందే తప్ప తరగదు.

ఇటీవలే థమ్సప్ యాడ్ కోసం మహేష్ ఎత్తిన కొత్త అవతారం అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. కొంచెం సన్నబడి కనిపించాడందులో.

తాజాగా మరో ప్రకటన కోసం మహేష్ కొత్త లుక్ లోకి మారి.. అభిమానుల్ని అలరిస్తున్నాడు.

ప్యారగాన్ చెప్పుల యాడ్లో నటిస్తున్నపుడు ఆన్ లొకేషన్ పిక్ ఒకటి బయటికి వచ్చింది. అందులో ఒక జీపు రిపేర్ చేస్తూ కనిపిస్తున్నాడు మహేష్.

దాదాపుగా మూడేళ్ళ నుండి బ్రాండ్ అంబాసిడర్ గా వహిస్తున్నాడు. ఈ పిక్ లో మహేష్ ‘రఫ్’ లుక్ లో కనిపించాడు.

ప్రిన్స్ లుక్ ఇందులో అదిరిపోయిందనే చెప్పాలి. చక్కటి హేర్ స్టైల్.. కొద్దిగా గడ్డం.. ట్రెండీగా ఉండే డ్రెస్సింగ్ తో ఆకట్టుకున్నాడు మహేష్.

ఈ తరం కుర్రాళ్లు వేసుకునే రిస్ట్ బ్యాండ్ కూడా చేతికి తొడుక్కున్నాడు మహేష్. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. ఏమాత్రం ఖాళీ దొరికినా ఆ డేట్లను ప్రకటనల చిత్రీకరణకు కేటాయిస్తున్నాడు మహేష్.

ఈ మధ్య అతను నటించిన థమ్సప్ ప్రకటనకు రెస్పాన్స్ అదిరిపోయింది. మరి ప్యారగాన్ యాడ్ ఎలా ఉంటుందో చూడాలి.

ఈ మధ్య కాలంలో మహేష్ బెస్ట్ లుక్ ఇదే అనిపించేలా చాలా స్మార్ట్ గా ఉన్నాడు ప్రిన్స్.

ఇదే లుక్ భ‌ర‌త్ అనే నేనులోనూ క‌నిపిస్తే అభిమానుల‌కు మ‌రింత ఖుషీనివ్వ‌డం ఖాయం అని అర్థ‌మ‌వుతోంది.

ప్రస్తుతం మహేష్.. కొరటాల దర్శకత్వంలో ‘భరత్ అను నేను’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ చిత్రంలో మహేష్ కి జోడీగా బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

2018 ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత వంశీ పైడిపల్లి సినిమాను మొదలుపెడతాడు ప్రిన్స్.

Share

Leave a Comment