‘సంక్రాంతి మొనగాడు’ ఆఫ్ టాలీవుడ్..

తెలుగు పండుగల్లో అతి పెద్దగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లె వాతావరణానికి కొత్త కాంతి వచ్చినట్లే. ఎక్కడ చూసినా ఆనందం, సంతోషం..

అటువంటి పండుగ కి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘సంక్రాంతి మొనగాడు’ ‘ఒక్కడు’ ఉన్నాడు.. ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు !!!

టక్కరి దొంగ నుంచి 1 నేనొక్కడినే వరుకు సంక్రాంతి కి విడుదలైన మహేష్ చిత్రాలు ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి.

అద్భుతమైన కథ, కథనాలతో మాత్రమే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా అటు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని మంత్రముగ్దుల్ని చేసాడు మహేష్ బాబు.

ఇక సినిమాల విషయాలకు వస్తే 2002 లో వచ్చిన టక్కరి దొంగ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక పెను సంచలనం.

కౌబాయ్ కారెక్టర్ సూపర్ స్టార్ కృష్ణ తరువాత ఆయన వారసుడికే సూట్ అయ్యింది అని సినీ వర్గాలు అప్పట్లోలో మాట్లాడుకున్నాయి.

జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో మహేష్ చాలా యంగ్/యాక్టివ్ గా కనిపించాడు. కరెక్ట్ గా సూట్ అయ్యాడు. ఈ చిత్రం వచ్చి 16 వసంతాలు పూర్తిచేసుకుంది.

ఒక్కడు మహేష్ బాబు లో ఉన్న మాస్ ఎలిమెంట్స్ బయటికి తీసుకువచ్చిన సినిమా.

పవర్ ప్యాకెడ్ యాక్షన్ సినిమాగా, చేజింగ్ సీన్స్, ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో వేసిన చార్మినార్ సెట్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.

జనవరి 15న 2003 రిలీజ్ అయిన ఈ చిత్రం 15 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఆ రోజుల్లో ఇది ఇండస్ట్రీ హిట్ గ నిలిచి చరిత్ర స్రుష్టించింది.

బిసినెస్ మాన్ సూర్య భాయ్ !! నెగటివ్ రోల్ తో కూడిన పొస్టీవ్ ఎలిమెంట్స్ పుష్కలంగా చూపించిన పూరి జగన్నాథ్ మహేష్ బాబు తో చెప్పించిన డైలాగ్స్ గట్టిగా పేలాయి.

సినిమా చాలా వరకు ముంబై లో షూట్ చేశారు. ఒక కామన్ మాన్ తన హీరోయిజం చూప్పించి విలన్ గుండెల్లో బుల్లెట్లు దింపాడు.

ఈ సినిమా 2012 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పటికి 6 వసంతాలు పూర్తి చేసుకుంది. మాస్ ఎంటర్ టైనర్ గ మంచి విజయం సాధించింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ అన్నా దమ్ములుగా నటించిన చిత్రం. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.

చాలా రోజులు తర్వాత బిగ్గెస్ట్ మల్టిస్టార్ గా వచ్చిన ఈ చిత్రంలో మహేష్ కుటుంబం లో చిన్నోడు గా కనిపించి తన నటన తో అందరిని అలరించాదు.

శ్రీకాంత్ అడ్డాల స్టోరీ చాలా మంది ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రం విడుదలయ్యి 5 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

1 నేనెఒక్కడినే మహేష్ బాబు నటవిశ్వరూపం చూపించారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో హాలీవుడ్ రేంజ్ ఏక్షన్ సీన్స్ తెరకెక్కించారు.

ఈ చిత్రం లో ప్రత్యేక ఆకర్షణ గా మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ నటించి అందరి ఆదరణ పొందాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ గ నిలిచింది.

ఉత్తమ బాలనటుడి గా గౌతమ్ అవార్డులు గెలుచుకున్నాడు అందులో నంది అవార్డ్ కూడా రావడం తో అభిమానులలో ఆనందంలో అంతులులేవు. ఈ సినిమా విడుదలయ్యి 4 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

ఈ చిత్రాలు అన్ని బాక్సఫీస్ వద్ద ఘన విజయాలు సాధించడం వలన మహేష్ బాబు “సంక్రాంతి మొనగాడు” ఆఫ్ టాలీవుడ్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. !!!!

– రామ్ సుభాష్

Share

Leave a Comment