ఆ రోల్ నిడివి ఎంతంటే

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఒకవైపు మహేష్ వరస విజయాలతో దూకుడు మీద ఉండడం మరోవైపు అనిల్ రావిపూడి కంటిన్యూ గా హిట్స్ సాధిస్తూ ఫుల్ జోష్ లో ఉండడంతో ఈ కాంబినేషన్ పై భారీ ఆసక్తి నెలకొంది. సరిలేరు నీకెవ్వరు జెట్ స్పీడ్ తో పూర్తవుతున్న సంగతి తెలిసిందే.

సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి చేసుకొని హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నాయని వినికిడి.

మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ అదరగొట్టనున్నట్లు సమాచారం. మొదటిసారి మహేష్ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేస్తుండడంతో అందరిలోనూ ఒకటే ఆశక్తి నెలకొంది. కానీ మొత్తం మీద సినిమాలో మహేష్ ఎక్కువ సేపు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించరట. చాలా తక్కువ సేపే మహేష్ ఆర్మీ గెటప్‌లో కనిపిస్తారట. అది కూడా సినిమా స్టార్టింగ్ లోనే ఆయన మేజర్ గా కనిపించనునంట్లు సమాచారం.

ఆర్మీ ఆఫీసర్ ఎపిసోడ్ ఫ్యాన్స్ మెచ్చేలా, నచ్చేలా ఉంటుందని యూనిట్ చెప్తోంది. తరువాత ఆర్మీ నుంచి మామూలు జనాల మధ్యలోకి రావడం, ఇక్కడ పోరాటం చేయడం సినిమా కథ అని ఫిలిం నగర్ సమాచారం. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా మిస్ కాకుండా సరిలేరు నీకెవ్వరు సాగుతుందట. విజయ శాంతి గారు ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

నిన్నటి నుంచి విజయశాంతి సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి విజయశాంతి ఫోటో ఒకటి పోస్ట్ చేసి 13 ఏళ్ళ తర్వాత విజయశాంతి గారు మేకప్ వేసుకున్నారు. ఈ 13 ఏళ్ళలో ఆవిడలో ఏం మార్పు రాలేదు. అదే క్రమశిక్షణ, అదే పద్ధతి, అదే డైనమిజం. వెల్కమ్ ఆన్ బోర్డ్ విజయశాంతి గారు అంటూ ట్వీట్ చేశారు.

ఈ ఫోటోలో మేకప్ వేసుకున్న విజయశాంతి గారి ఫోటో మసగ్గా ఉంది. మహేష్ బాబు కూడా వెల్కమ్ ఆన్ బోర్డ్ విజయశాంతి గారు అంటూ ట్వీట్ చేశారు. వీరికి విజయశాంతి గారు కూడా ట్వీట్ తో జవాబిచ్చారు. అనిల్ రావిపూడి గారు, మహేష్ బాబు గారు నన్ను ఆహ్వానించినందుకు కృతఘ్నతలు. యాటిట్యూడ్ ఈజ్ యాన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ది పర్సన్.

వాతావరణం మారుతూ ఉండొచ్చు, కానీ యాటిట్యూడ్ అనేది ఎప్పటికీ మారదు. అలానే మీరు, నేను కూడా అని ట్వీట్ చేసారు విజయశాంతి. మహేష్ బాలనటుడుగా ఉన్నప్పుడు విజయశాంతి తో కలిసి నటించడం జరిగింది. అయితే అప్పుడు కృష్ణగారు సూపర్ స్టార్. ఇప్పుడు కృష్ణగారి అబ్బాయి మహేష్ సూపర్ స్టార్. మహేష్, విజయశాంతి కాంబినేషన్ సీన్స్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

మరి అనిల్ రావిపూడి వారి కాంబినేషన్ ను ఎలా ప్రెజెంట్ చేశాడో తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచి చూడక తప్పదు. రీసెంట్ గా మహేష్ పుట్టినరోజు నాడు ది ఇంట్రో అంటూ మహేష్ ఇంట్రడక్షన్ టీజర్ ను రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి మరో ఆన్ లొకేషన్ స్టిల్ బయటకు వచ్చింది.

ఈ ఫోటోలో మహేష్ బాబుకు దర్శకుడు అనిల్ రావిపూడి సీన్ వివరిస్తూ ఉంటే మహేష్ ఎంతో శ్రద్ధగా వింటున్నారు. బ్లాక్ టీ షర్ట్, మిలిటరీ గ్రీన్ ప్యాంట్ ధరించి సూపర్ ఫిట్ గా కనిపిస్తున్నారు మహేష్. ఒక చేతిని ప్యాంట్ జేబులో పెట్టుకొని మరో చేతిలో స్మార్ట్ ఫోన్ తో స్టైలిష్ గా ఉన్నారు. నేపథ్యంలో ఒక వాగు, కొండలు ఉన్నాయి.

ఇంట్రో లో మనం చూసిన సీన్ నుంచి వ్చ్చిన్ వర్కింగ్ స్టిల్ యే ఇది. కశ్మీర్ షెడ్యూల్ లోని స్టిల్ అనమాట. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్ బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Share

Leave a Comment