క్లారిటీ ఇచ్చేసారు

సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబో లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. రీసెంట్ గా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు సినిమా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ట్రైలర్ ఇచ్చిన అనిల్ రావిపూడి అండ్ టీమ్ మళ్ళీ వారం తిరగకుండానే ఆగస్టు 15 కి సోల్జర్స్ మీద డిజైన్ చేసిన స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసారు.

సరిలేరు నీకెవ్వరు అని టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి అనిల్ రావిపూడి ఇది కేవలం మహేష్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని పెట్టిన టైటిల్ అని అందరూ భావించారు. కొందరైతే మహేష్ కి ఎవ్వరు సరిలేరు సాటిలేరు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వేశారు. అయితే ఒకే ఒక్క పాటతో అందరికీ క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

సినిమాలో మహేష్ అజయ్ కృష్ణ అనే మేజర్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అతని క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ ఓ సాంగ్ తో ఇండియన్ ఆర్మీ కి ఓ ట్రిబ్యూట్ ఇచ్చారు. అదే సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్. లిరిక్స్ ఆకట్టుకున్నాయి. సాంగ్ చివరిలో సరిలేరు నీకెవ్వరు అంటూ అజయ్ కృష్ణ ని ఉద్దేశించి లిరిక్స్ పడ్డాయి.

ఈ పాటతో టైటిల్ పెట్టడానికి గల కారణం అందరికీ తెలిసింది. ఒక ఆర్మీ మేజర్ గా సరిలేరు నీకెవ్వరు అని అందరిచేత అనిపించుకుంటాడని అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఈ రీసెంట్ స్పెషల్ సాంగ్ వీడియో లో కూడా మహేష్ కి సంబందించిన మరొక రెండు షాట్స్ యాడ్ చేసి ఇచ్చారు. మహేష్ ఆర్మీ గెట్ అప్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

దేశ భద్రత కోసం సరిహద్దుల్లో సైనికులు అహో రాత్రాలు మనకోసం పడుతున్న కష్టం చేస్తున్న త్యాగాన్ని వివరిస్తూ ఇప్పటిదాకా చరిత్రలో జరిగిన అతి కీలక యుద్ధ ఘట్టాలను సంవత్సరాలతో సహా పొందుపరుస్తూ అప్పటి విజువల్స్ ని చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. భగ భగ భగ మండే నిప్పుల వర్షం వచ్చినా జనగణమంటూ దూకేవాడు సైనికుడు అంటూ మొదలైన ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో మహేష్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం సెట్‌లో సరదాగా గడిపిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హరితేజ ఈ ఫొటోను స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. కథానాయిక రష్మిక, దర్శకుడు అనిల్‌ రావిపూడి, సంగీత, బండ్ల గణేష్, హరితేజ తదితరులు ఈ ఫొటోలో కనిపించారు.

ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ ని ప్లాన్ చేసుకుంది యూనిట్. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో యాక్షన్ సీన్ ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వ్ర్యంలో ఈ యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. విజయశాంతి కూడా ఇటీవలే జాయిన్ అయిన సంగతి తెలిసిందే. విజయశాంతి సన్నివేశాలను హైదరాబాద్ నల్సార్ లా కాలేజీలో చిత్రీకరించినట్లు సమాచారం.

మరి ఆవిడ పాత్రేంటో అని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్, విజయశాంతి కాంబినేషన్ సీన్స్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మూవీ కోసం కర్నూల్ కొండారెడ్డి బురుజు సెట్ ని వేయడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడే సరిలేరు నీకెవ్వరు ద్వితీయార్థానికి సంబంధించి కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు.

ఈ వేగం గమనించినవాళ్లు ఎవరైనా మీ జోరుకి సరిలేరెవ్వరూ అనాల్సిందే! ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్ లోకి రానుంది. నవంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ ఆద్యంతం ప్రమోషన్స్ చేయాలన్నది ప్లాన్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్ బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Share

Leave a Comment