వసూళ్ల ప్రవాహం..!

సరిలేరు నీకెవ్వరు వసూళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. క్లాస్, మాస్ సెంటర్స్ అన్నింటిలో మహేష్ బాబు సత్తా చాటుతున్నారు. ఈ సంక్రాంతికి స్పెషల్ ట్రీట్ ఇస్తూ సరికొత్త కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు నాలుగో రోజూ కూడా కుమ్మేసింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ మీద లుక్కేద్దామా..

సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా తొలి మూడురోజుల్లోనే వందకోట్ల మార్క్‌ను దాటేసింది. బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌గా బాక్సాఫీస్‌ వద్ద హల్‌చల్‌ చేస్తున్న ఈ సినిమా మూడు రోజుల్లో 103 కోట్ల రియల్‌ గ్రాస్‌ వసూలు చేసిందని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది. మూడురోజుల్లోనే వందకోట్లు వసూలు చేసింది. పండగ టైం లో పోటి లో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అది మామూలు విషయం కాదు. ఇక సినిమా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుండగా మొత్తం మీద 4 వ రోజు కలెక్షన్స్ తో బిజినెస్ ని అందుకోవడానికి మరింత ముందుకు వెళ్ళబోతుంది.

కేవలం తెలుగు రాష్ట్రాల జనమే గాక, ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల జనం కూడా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు నీరాజనం పలుకుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాలుగో రోజుకూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించింది.

నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ హాలిడే ను ఓ రేంజ్ లో వాడుకున్న ఈ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో రోజుని ఘనంగా ముగించబోతుంది. సినిమా 4 వ రోజు వెస్ట్ గోదావరి లో 49,08,403 షేర్ వసూలు చేసింది (మొత్తం షేర్ 4,00,87,424). కృష్ణ లో 63,30,695 షేర్ వసూలు చేసింది (మొత్తం షేర్ 4,85,89,203).

నెల్లూరు లో మొత్తం షేర్ 2,09,70,091. కాకినాడ లో కోటి కి పైగా షేర్ వసూలు చేసింది. కొన్ని సెంటర్స్ అయితే ఏకంగా 90% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అయ్యాయి. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా అన్ని సెంటర్స్ లో అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం అద్బుతంగా ఉన్నాయి.

సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తూ దూసుకుపోతుంది, సినిమా మూడు రోజుల్లోనే సాలిడ్ గా బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకురాగా సినిమా ఇప్పుడు అసలు సిసలు పండగ సెలవుల్లో అడుగు పెట్టింది. ఎక్కడా డ్రాప్స్ లేకుండా అదే టెంపో ని మెయింటెయిన్ చేస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో 500 కి పైగా థియేటర్స్ లో రన్ కానుంది, దాంతో కలెక్షన్స్ స్టడీ గా ఉండటమే కాదు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ సాలిడ్ గా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా అల్టిమేట్ అనిపించే విధంగా కొనసాగుతున్నాయి.

సూపర్‌స్టార్ మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించాడు. ఈ సినిమాలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే అంశాలపై దర్శకుడు అనిల్‌ బాగా ఫోకస్‌ చేశాడని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌లో బాక్సాఫీస్‌ వద్ద సరిలేరు నీకెవ్వరు భారీగానే వసూళ్లు రాబట్టినట్టు ట్రెడ్‌ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌కా బాప్ అనిపించుకున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఈ వారాంతం కల్లా భారీ వసూళ్లు రాబట్టడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. సంక్రాంతి సెలవులు కావడం చిత్రానికి బాగా కలిసొచ్చిన అంశం అంటున్నారు. ఏదేమైనా ఈ సంక్రాంతి మొగుడు అని నిరూపించుకున్నారు మహేష్.

Share

Leave a Comment