కలెక్షన్ల సునామీ..!!

సూపర్‌స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ జోష్ కొనసాగుతూనే ఉంది. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ బాక్సాఫీస్‌ బద్దలు కొడుతోంది. మహేష్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది.

ఈ సినిమా ది బెస్ట్ అని ఇప్పటికే నిరూపించుకుంది. చిత్రంలో మహేష్ బాబు నటన, అనిల్ రావిపూడి టేకింగ్, కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంత కాంపిటీషన్లోనే ఈ రేంజిలో వసూళ్ళు సాధించడం మాటలు కాదు. ఈ సినిమా తొలి 8 రోజుల్లో ఎంత రాబట్టిందో వివరంగా చూద్దామా.

ఈ నేపథ్యంలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తూ విడుదలైన వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది సరిలేరు నీకెవ్వరు మూవీ. సూపర్‌స్టార్ క్రేజ్, సంక్రాంతి సెలవులు, ఎక్స్‌ట్రా షోస్ ఈ కలెక్షన్స్‌లో కీలకపాత్ర పోషించాయి. దీంతో 8 రోజుల్లో మొత్తంగా 112.03 కోట్ల షేర్ రాబట్టింది ఈ సినిమా.

స‌రిలేరు నీకెవ్వ‌రు మూవీకి గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఈ 8 రోజుల్లో నైజాంలో 29.8 కోట్లు, సీడెడ్ 13.25 కోట్లు, ఉత్తరాంధ్ర 14.9 కోట్లు, ఈస్ట్ గోదావరి 9.04 కోట్లు, వెస్ట్ గోదావరి 6.02 కోట్లు, గుంటూరు 8.51 కోట్లు, కృష్ణా 7.34 కోట్లు, నెల్లూరు 3.32 కోట్లు వసూలయ్యాయి.

ఇక సరిలేరు నీకెవ్వరు రెస్ట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చూస్తే కర్ణాటక రాష్ట్రంలో 7 కోట్లు, తమిళనాడు 1 కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలన్నీ కలిపి 1.5 కోట్లు, యూఎస్‌ఏ 7.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 2.5 కోట్లు రాబట్టి మొత్తంగా 112.03 కోట్ల షేర్ వసూలు చేసింది సరిలేరు నీకెవ్వరు మూవీ.

మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు సినిమా రూ. 112 కోట్ల షేర్ తో విడుదలైన అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ చేరుకుని సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లకు వచ్చారు. పలు ప్రాంతాల్లో డిస్ర్టిబ్యూటర్లకు లాభాలను పంచుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నిజమైన సంక్రాంతి పండగ వచ్చినట్లైంది.

ఆరంభ కలెక్షన్లలో మహేశ్‌ను మించినవారు లేరు. ఇక హిట్, బ్లాక్ బాస్టర్ టాక్స్ వచ్చాయంటే ఆ హంగామా వర్ణించలేనిది. ఇప్పుడు అదే జరుగుతోంది. బ్లాక్ బాస్టర్ టాక్‌తో సరిలేరు నీకెవ్వరు ఎక్కడా డ్రాప్స్ లేకుండా దూసుకెళ్తుంది. మహేశ్ మానియా వర్కవుట్ అయ్యి కలెక్షన్ల సునామీ సాగుతోంది.

ఇక సినిమా అమెరికాలో ప్రీమియర్స్ అలాగే వారం రోజుల కలెక్షన్స్ తో 2 మిలియన్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా మహేష్ కెరీర్ లో 8 వ 1.5 మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమా గా, 10 సార్లు యూఎస్ బాక్సాపీస్ వద్ద తొలిరోజే 1 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన ఏకైక హీరోగా నిలిచాడు సూపర్ స్టార్.

భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్‌ సినిమా కావడం, కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో సరిలేరు నీకెవ్వరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచానాలను అందుకోవడం లో పూర్తిగా సక్సెస్ అయ్యరనే చెప్పాలి.

సంక్రాంతి పండుగ వేళ వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న వేళ ప్రమోషన్ వర్క్ తో మరింత దూసుకెళ్లేందుకు వీలుగా వరంగల్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. భారీగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో సూపర్‌స్టార్ మహేశ్ తనదైన శైలి లో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.

Share

Leave a Comment