దద్దరిల్లిపోయిన కలెక్షన్స్ రిపోర్ట్..

సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి సక్సెస్ అందుకున్నారు. తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు ద్వారా సంక్రాంతి రేస్‌లో నిలిచి క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో సరిలేరు నీకెవ్వరు మూవీ అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది.

పండగ జోష్ చూపిస్తూ సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ అయ్యారు. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేస్తోంది. బ్లాక్‌బ‌స్ట‌ర్ కా బాప్ అనిపించుకుంది. ఈ సినిమా తొలి ఐదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ షేర్ 68.36 కోట్లు నమోదు చేసిందని తాజా రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తోంది.

నైజాంలో 22.5 కోట్లు, ఉత్త‌రాంధ్ర‌ 10.05 కోట్లు, సీడెడ్‌‌ 9.75 కోట్లు, గుంటూరు 7.19 కోట్లు, ఈస్ట్ గోదావ‌రి 6.22 కోట్లు, కృష్ణా 5.55 కోట్లు, వెస్ట్ గోదావ‌రి 4.54 కోట్లు, నెల్లూరు 2.56కోట్లు. సూపర్ స్టార్ అందుకున్న ఈ విజయాన్ని చూసి ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ట్రేడ్ వ‌ర్గాల సమాచారం మేర‌కు ఈ సినిమా చాలా ఏరియాల్లో సరికొత్త నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను నమోదు చేసిందని తెలుస్తోంది. ఈస్ట్ గోదావ‌రి, నైజాం, నెల్లూరు ప్రాంతాల్లో నాన్ బాహుబలి రికార్డులు కొట్టి సత్తా చాటిన ఈ చిత్రం గుంటూరు, వైజాగ్ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌కి చేరువైంది. వెస్ట్ గోదావ‌రిలో అయితే మహేష్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ రాబట్టింది.

మ‌హేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించే దిశ‌గా స‌రిలేరు నీకెవ్వ‌రు ప‌రుగులు తీస్తోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సరిలేరు నీకెవ్వరు మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత అదే జోష్ కంటిన్యూ చేస్తూ 3 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా 103 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

మూడు రోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ప్రదర్శించబడిన సరిలేరు నీకెవ్వరు మూవీ నాలుగో రోజూ కూడా చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది. ఇక 5వ రోజుకు వచ్చేసరికి సంక్రాంతి సెలవు కలసి వచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఐదో రోజు ఈ సినిమా మాంచి వసూలు చేసిందని రిపోర్ట్స్ అందాయి.

స్పెషల్ షోస్ అనుమతి పైగా సంక్రాంతి సెలవులు యాడ్ కావడంతో మొదటి ఐదు రోజులు మంచి కలెక్షన్సే రాబట్టాయి. ఈ జోష్ ఈ ఆదివారం వరకు కనిపించే అవకాశం ఉంది. కలెక్షన్స్ స్టడీ గా ఉండటమే కాదు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ సాలిడ్ గా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ అల్టిమేట్ అనిపించే విధంగా కొనసాగుతున్నాయి.

ఈ చిత్రం రిలీజ్ అయిన తొలి రోజే పాజిటివ్ టాక్ సాధించింది. శ్రీమంతుడు, భారత్ అనే నేను, మహర్షి, సందేశాత్మక చిత్రాలు చేస్తున్న మహేష్ చాలా కాలం తర్వాత కమర్షియల్ మూవీ చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద సరిలేరు నీకెవ్వరు సినిమా దద్దరిల్లుతుంది. కొత్త రికార్డులతో దూసుకుపోతుంది.

సూపర్‌స్టార్ మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించాడు. ఈ సినిమాలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే అంశాలపై దర్శకుడు అనిల్‌ బాగా ఫోకస్‌ చేశాడని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌లో బాక్సాఫీస్‌ వద్ద సరిలేరు నీకెవ్వరు భారీగానే వసూళ్లు రాబట్టినట్టు ట్రెడ్‌ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని ఈ చిత్రానికి చిత్రయూనిట్ బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. ఇప్పుడీ బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ సెల‌బ్రేష‌న్స్‌ను నిర్వహించేందుకు ప్లేస్‌ను ఫిక్స్ చేశారు. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ సెల‌బ్రేష‌న్స్‌ను శుక్రవారం సాయంత్రం 5 గంట‌ల‌కు వ‌రంగ‌ల్ హ‌న్మ‌కొండ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వ‌హించనున్నారు.

Share

Leave a Comment