సరిలేరు టీమ్ సందడి

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కి రిలీజ్ కానున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలను అభిమానులు పెట్టుకున్నారు.

మహేష్ కు సంబంధించిన వరకు కూడా ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా సరే అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యిపోతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కేరళ లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ అక్కడి అందమైన ప్రదేశాల్లో జరిగింది. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి చిత్ర బృందం మొత్తం గ్రూప్ ఫోటో తో సందడి చేసింది.

అక్కడి రైల్వేస్టేషన్ లో చిత్ర బృందం కలిసి తీసుకున్న గ్రూప్ ఫొటోను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ లో పోస్ట్ చేసింది. మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక, ప్రకాష్ రాజు, రాజేంద్రప్రసాద్, సంగీత, రఘుబాబు, దర్శకుడు అనిల్ రావిపూడి ఇతర నటీనటులు టెక్నీషియన్స్ అంతా కొలువుదీరిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ ఇండియా లో హల్ చల్ చేస్తోంది.

ప్ర‌కాష్ రాజ్ పంచె క‌ట్టులో క‌న‌ప‌డితే మ‌హేష్ ఆర్మీ డ్రెస్‌లో క‌న‌ప‌డ్డారు. చిత్రంలో మహేష్ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ ఫొటో సూపర్ స్టార్ అభిమానులకు కనుల పండుగే అని చెప్పాలి. కేరళలో షూటింగ్ సందర్భంగా యూనిట్ సభ్యులంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. ఈఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

1)

2)

3)

విభిన్నమైన కథలు ఎంచుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి లాంటి వరుస హిట్లతో దూసుకుపోతున్నారు మహేష్ బాబు. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్ నటి విజయశాంతి ఇందులో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.

మహేష్ బాబు సినీ కెరీర్ లోనే మొదటి సారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మహేష్ బాబు కు తోడు భారీ తారగణం, దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ రేట్ ఇలా అన్ని అంశాలు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చిన అది ఓ సంచలనం గా మారిపోతుంది.

ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. మరో మూడు వారాల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాబోతుందని సమాచారం. పక్క మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇదిలా వుంటే డిసెంబర్‌ నుంచి సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్లు మోత మోగిస్తారని సమాచారం. ఈ ప్రచారం లో భాగంగా మాస్‌ సాంగ్‌ని విడుదల చేసి అభిమానులని అలరించనున్నారని వినికిడి.

ఇప్పటికే ఈ మాస్ సాంగ్ గురించి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు తన ట్విట్టర్ లో హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ మళ్లీ అలాంటి మాస్‌ ఎంటర్‌టైనర్‌ చేయలేదు కనుక ఈ చిత్రాన్ని జనం అదే రేంజి లో ఆదరిస్తారని అందరూ విశ్వసిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు అన్నట్లుగా అలరించే విధంగా ఈ చిత్రంలోని మహేష్ పాత్ర ఉంటుందట.

ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ ఇలా ప్రతి విషయంలో కూడా టైటిల్ కు తగ్గట్లుగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. చాలా రోజుల తరువాత మహేష్ నుంచి వస్తున్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో సరిలేరు నీకెవ్వరు సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2020 సంక్రాంతికి అసలైన ట్రీట్ ఉంటుంది.

Share

Leave a Comment