మైండ్ బ్లాక్ చేసే మాస్ సాంగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి నేటి నుంచి సరిలేరు నీకెవ్వరు సందడి మొదలైపోతుంది. మాస్ ఎంబీ మహేష్ పేరిట చిత్ర యూనిట్ కొత్తరకం ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ మొదటి సోమవారం నుంచి ఐదు సోమవారాల్లో ఐదు పాటలు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ సమయం ఆసన్నమైంది.

ఈ రోజే మొదటి సోమవారం. సరిలేరు నీకెవ్వరు నుంచి తొలి పాట వచ్చేస్తోంది. ‘మైండ్ బ్లాక్’ అంటూ సాగే మంచి మాస్ సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. ఈ పాట లిరికల్ సాయంత్రం 5.04 గంటలకు యూట్యూబ్‌లో విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటినుండో అడుగుతున్న విధంగా తమ సినిమా నుండి మొదట మాస్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నాం అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా మంచి కంటెంట్ తో పాటుగా పాటలు, మంచి వినోదాన్ని అందించేందుకు మేము చాల కష్టపడ్డాం. ఈ చిత్రంలోని పాటలు మీరెంతగానో ఇష్టపడతారని బావిస్తున్నా అని దేవి అన్నారు.

ఈ సారి సాంగ్ కేకలు పెట్టించేలా మునుపెన్నడూ చూడని విధంగా ఫాస్ట్ బీట్‌తో అదరగ్గొట్టేస్తుందని లేటెస్ట్ సమాచారం. ఈ సాంగ్ విని థియేటర్స్‌లో ప్రేక్షకులు ఉగిపోవాల్సిందే అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఏడాది డిసెంబర్ ఎండింగ్, వచ్చే ఏడాది జనవరి స్టార్టింగ్ లో వచ్చే న్యూ ఇయర్‌ వేడుకల్లో ఈ పాటదే హంగామా అంతా అంటున్నారు కొందరు.

ఇక ఈ సాంగ్ తో పాటు సినిమాలోని సాంగ్స్ అన్నిటికీ దేవిశ్రీ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా, రేపు సాంగ్స్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు మరింత పెంచడం ఖాయంగా కనపడుతోంది. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే

ఇక లిరికల్ వీడియోల పరంగా ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. మహేష్‌ను మాస్‌ ఇమేజ్‌లో చూసి చాలా రోజులు అవుతుండటంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. మహేష్ కెరీర్ లో ఇది మరో బ్లాక్ బస్టర్ రికార్డు సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా ప్రేక్షకులు అంచనాలు పెంచేసుకుంటున్నారు.

ఈ సినిమా ద్వారా సంగీత, లేడీ అమితాబ్ విజయశాంతి కూడా కొంత గ్యాప్ తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక ముందు నుంచి చిత్ర యూనిట్ ఇంకెలాంటి ప్రమోషన్స్ ప్లాన్ చేసిందో చూడాలి. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్ అన్నీ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నింపుతున్నాయి.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండోబోతోందని టాక్. ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ చేసే పోరాటాలు, ట్రయిన్ ఎపిసోడ్, కర్నూలు కొండారెడ్డి బుర్జు సెంటర్ ద‌ృశ్యాలు అబ్బుర పరుస్తాయని తెలుస్తోంది. జంటగా రష్మిక నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, బండ్ల గణేష్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న మహేష్.. టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా కీర్తించబడుతున్నారు. కాబట్టి ఆయన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరుపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ఫన్ మాత్రమే కాకుండా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. సరిలేరు నీకెవ్వరు ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది అని అందరూ ధీమాగా ఉన్నారు.

ఈసారి పూర్తిగా కమర్షియల్‌ ఫార్ములాకి తగ్గట్టుగా ఎక్కడ ఏది వుండాలో అలా మీటర్‌లో వేస్తూ పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ని సిద్ధం చేస్తున్నాడు రావిపూడి. ఈ మూవీ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు ప్రత్యేక పాత్రలు అద్భుతంగా వచ్చేందుకు స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ద చూపించినట్టు టాక్.

Share

Leave a Comment