అలాంటిలాంటి రికార్డు కాదు.!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా బాక్సాఫీస్ దుమ్ముదులిపేసింది. అంచనాలను మించి వసూళ్లు రాబట్టి సూపర్ సక్సెస్ అనిపించుకుంది. దేశవిదేశాల్లో మహేష్ హంగామా కనిపించింది. ఈ నేపథ్యంలో గతంలో ఏ హీరోకు దక్కని సరికొత్త ఫీట్ సాధించారు మహేష్ బాబు. ఈ మేరకు ఆయన పేరిట న్యూ రికార్డు నెలకొల్పబడింది.

సరిలేరు నీకెవ్వరు మొదటిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. మహేష్ కెరీర్ బెస్ట్ నంబర్స్ నమోదు చేస్తూ కొన్నిచోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ తన పేరిట లిఖించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ బాక్సాఫీస్‌పై సరిలేరు నీకెవ్వరు దాడి కనిపించింది. బాక్సాఫీస్ బద్దలయ్యేలా మొదటిరోజే 1 మిలియన్ డాలర్ (ప్రీమియర్స్‌తో కలిపి) కలెక్షన్స్ రాబట్టాడు మన సూపర్ స్టార్.

ఓవర్సీస్లో మహేష్ బాబు సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన చాలా సినిమాలు మొదటి రెండు రోజుల్లోనే మిలియన్ డాలర్ మార్క్ అందుకుంటుంటాయి. అయితే సరిలేరు నీకెవ్వరు మాత్రం మొదటి రోజులోనే మిలియన్ డాలర్ మార్కును దాటేసింది. మహేష్ సినిమాలు మిలియన్ మార్క్‌ను దాటడం ఇది వరుసగా పదోసారి.

అంతే కాకుండా ప్రస్తుతం అదే జోరు తో 1.5 మిలియన్ మార్కు ని సొంతం చేసుకొని సరిలేరు నీకెవ్వరు అని అందరి చేత అనిపించుకుంటున్నాడు మహేష్. ఈ సినిమా ద్వారా 8 సార్లు యూఎస్ బాక్సాపీస్ వద్ద 1.5 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన ఏకైక హీరోగా నిలిచాడు సూపర్ స్టార్. సౌత్ ఇండియా లోనే ఇప్పటిదాకా ఇలాసాధించిన హీరోలు లేరు.

ఆ ఫీట్ మహేష్ మాత్రమే చేరుకోగలిగాడు. సంక్రాంతి సెలవులు కూడా రావడంతో థియేటర్లన్నీ హౌజ్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. బెనిఫిట్ షోలకే మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను చేసేందుకు మహేష్ ఫ్యాన్స్‌తో పాటు సాధారన ప్రేక్షకులు ఎగబడ్డారు. అటు వీకెండ్ కూడా కావడంతో మహేష్ మేనియాతో రెండు తెలుగు రాష్ట్రాలు ఊగిపోయాయి.

ఓవర్సీస్‌లో ఈ మేనియా ఇంకాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఓవర్సీస్‌లో మహేష్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.అలాంటిది ఆయన సినిమా రిలీజ్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి ఫీట్ ఓవర్సీస్‌లో మరే తెలుగు హీరో చేయకపోవడం విశేషం. మహేష్ బాబు మేనియాతో ఆడియెన్స్ నిజంగా సరిలేరు నీకెవ్వరు అంటున్నారు.

ఇక ఫుల్ రన్ పూర్తయ్యే నాటికి ఈ చిత్రం మహేష్ కెరీర్లో ఉత్తమమైన వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలవడం ఖాయం. దీంతో ఓవ‌ర్సీస్‌లో మ‌హేష్ స్టామినా ఏంటో మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌గా ఉన్న మ‌హేష్ ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ అయిపోయాడు.

గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో తన డాన్స్‌తో ఆకట్టుకున్నారు మహేష్ బాబు. ఆయన డైలాగ్ డెలివరీ, హీరోయిన్ రష్మికతో రొమాన్స్ సూపర్ స్టార్ అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చాయి. దీంతో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ రాబట్టి సరిలేరు తనకెవ్వరు అని నిరూపించారు మహేష్.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో థియేటర్స్ దద్దరిల్లాయి. బొమ్మ దద్దరిల్లిపోయింది అనే టాక్ బయటకొచ్చింది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కొత్త సంవత్సరానికి కిక్ స్టార్ట్ ఇస్తూ తొలిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 32 కోట్లకు పైగా కొల్లగొట్టారు మహేష్ బాబు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. లేడీ అమితాబ్ విజయశాంతి కీలక రోల్ పోషించింది. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరించారు.

Share

Leave a Comment