మరికొద్ది గంటల్లో

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా వరుస సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే భరత్ అనే నేను మరియు మహర్షి లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ను ఖాతాలో వేసుకున్న మహేష్ ఫుల్ జోష్ లో ఉన్నారు. దీనితో మూడో బ్లాక్ బస్టర్ కోసం సినీ ప్రేక్షకులు ఉవ్విల్లూరుతున్నారు.

ఈ చిత్రంలో మహేష్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కు సంబంధించి స్వయంగా దర్శకుడే ఒక ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కి దసరా గిఫ్ట్ రెడీ చేశారు. దసరా సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్రం నుండి ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేయనున్నారు.

ఈ దసరా స్పెషల్ గా ఒక సరికొత్త పోస్టర్ ఉందని అది ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టుగా తెలిపారు. అంతే కాకుండా మీరు ఎలా చూడాలనుకుంటున్నారో అలా అని స్పెషల్ గా చెప్పారు. ఈ ఒక్క అప్డేట్ తో అభిమానులు మాత్రం ఫుల్ జోష్ లోకి వచ్చేసారు. ఈ కొత్త పోస్టర్ గురించి ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

దాదాపు 75శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలతో పాటు, పాటలు చిత్రీకరించాల్సి వుంది. ఈ చిత్రంలో విజయ శాంతి ఓ కీలకపాత్ర చేస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది విడుదల అవుతుంది.

అయితే మహేష్ బాబు మాత్రం ఈ దసరా పండక్కి అందుబాటులో ఉండరు. ఆయన కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. దసరా బ్రేక్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాను. ఫుల్‌ చార్జ్‌తో తిరిగి వస్తా అన్నారు మహేష్. మహేష్ తనకు ఎంతగానో ఇష్టమైన స్విట్జర్లాండ్‌ కు కుటుంబంతో సహా వెళ్ళినట్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసారు.

పండగ సమయాల్లో మహేష్ విహార యాత్రలకు వెళ్లడం ఇది మొదటిసారేం కాదు. ఎలాగూ పిల్లలు గౌతమ్, సితారలకు స్కూల్‌ సెలవులు ఇచ్చేశారు. వాళ్ల సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ హాలిడే ట్రిప్‌ ప్లాన్‌ చేశారట. విదేశాల్లో ఫ్యామిలీతో సెలవుల పండగ చేసుకుని తిరిగొచ్చిన తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు మహేష్.

మరో పక్క కొన్ని మహేష్ ఫొటోలు సోషల్ మీడియాను నేడు ముంచెత్తుతున్నాయి. అవి ఏ సినిమాకూ సంబంధించినవి కావు. ప్రఖ్యాత మ్యాగజైన్ వోగ్ అక్టోబర్ కవర్ పేజీపై సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్పెషల్ ఫొటోషూట్ ను వోగ్ అధికారిక ఖాతా ద్వారా షేర్ చేశారు.

మహేష్ ప్రతీ ఫొటోలోనూ లుక్ అండ్ గెటప్ చితక్కొట్టేశాడు. గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ విషయంలో సరిలేరు నీకెవ్వరు అన్న రేంజ్ లో ఈ వోగ్ ఫొటోషూట్ పిక్స్ ఉన్నాయి. మహేష్ ను ఇంత అల్ట్రా మోడ్రన్ గా చూసి చాలా రోజులు అయ్యింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

Share

Leave a Comment