టాప్ స్థానంలో

సూపర్ స్టార్ మహేష్ బాబు మండే సర్‌ప్రైజ్ అదిరింది. మొదటి మండే మైండ్ బ్లాక్ చేసిన మహేష్, రెండో మండే కూడా ట్రెండ్ అవుతున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి విడుదలైన రెండో పాట సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో యు ట్యూబ్ ట్రెండింగ్ లిస్టులో అన్నీటినీ పక్కకునెట్టి టాప్ స్థానంలో నిలిచింది.

సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో అంటూ సాగిపోతున్న సరిలేరు నీకెవ్వరు సెకండ్ సాంగ్ లిరిక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్‌పై దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఫ్రెష్ మెలోడీ ట్యూన్స్ క్లాస్, మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట హంగామానే కనిపిస్తోంది.

రికార్డుల పరంగా కూడా ఈ పాట తన జోరు కొనసాగిస్తుంది. టాలివుడ్ లో ఫాస్టెస్ట్ 50k లైక్స్ తో పాటు ఫాస్టెస్ట్ 100k లైక్స్ కూడా సాధించి సూపర్‌స్టార్ శ్తామినా ఎంటో మరోసారి అందరికీ తెలియజేసింది. సుమారుగా అరవై నిమిషాల్లోనే ఈ ఫీట్ ని సాధించి అప్పటి వరకు టాప్ లో ఉన్న అన్ని లిరికల్ వీడియోస్ ని బీట్ చేసింది ఈ సాంగ్.

దేవుడెక్కడో లేడు, వేరే కొత్తగా రాడు, మంచి మనుషులలో, గొప్ప మనసు తనై ఉంటాడు నీకు లాగా..ఏ లోక కల్యాణాన్ని ఆశించి జన్మిచ్చిందో నినుకన్న తల్లి కడుపు నిండారా పండింది, నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయహో అన్నది అనే అందమైన పదాలని కూర్చి ఈ పాటను రాసారు శాస్త్రి గారు.

కథానాయకుడి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ సాగే పాట ఇది. చాలా తేలికైన పదాలతో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట అందరికీ అర్థమయ్యేలా అందంగా సాగుతోంది. విజువల్స్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ పాటలో విజయశాంతి, మహేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

మహేష్‌ కు మార్గదర్శి వంటి స్థానంలో ఆమె ఈ చిత్రంలో నటించినట్లుగా పాట చూస్తుంటే తెలుస్తుంది. మహేష్, విజయశాంతిలను అలా చూస్తుంటే.. రెండు కళ్లూ చాలవేమో అన్నట్లుగా కెమెరామెన్ రత్నవేలు తగిన మూడ్‌, కలరింగ్‌ను క్రియేట్ చేశారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు దేవిశ్రీ ఈ పాటతో మ్యూజికల్ ట్రీట్ ఇచ్చేశారు.

ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ మిలటరీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఒకప్పటి లేడీ అమితాబ్ విజయశాంతి నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది. సూపర్‌ స్టార్‌ ఫాన్స్‌కి ఫీస్ట్‌ గా సంక్రాంతి ఎంటర్టైనర్‌ సరిలేరు నీకెవ్వరు ఉండబోతోంది అని తెలుస్తోంది.

ఇప్పటి వరకు విడుదలైన సరిలేరు నీకెవ్వరు అప్‌డేట్స్ చూస్తుంటే ఈ సినిమా మహేష్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలుస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కామెడీ సన్నివేశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది.

Share

Leave a Comment