ఈరోజు సాంగ్ ప్రత్యేకతలివే..

సూపర్ స్టార్ మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు తో సంక్రాంతికి రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లాక్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రాగా ఆడియన్స్ ఎదురు చూస్తున్న సెకండ్ సాంగ్ డిసెంబర్ 9న (సోమవారం) సాయంత్రం 5:04 కి విడుదల కానుంది.

సూర్యుడివో చంద్రుడివో అనే పల్లవి తో సాగే ఈ పాట వినసొంపైన ఫామిలీ మెలోడీ సాంగ్ గా ఉండనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంత గానో ఆకట్టుకునే ఒక సోల్ ఫుల్ మెలోడీ గా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు. ఎన్నో మెలోడీ సాంగ్స్ ఇచ్చిన దేవి చేసిన మరో సూపర్ మెలోడీ సాంగ్ ఇది.

రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ఫ్యామిలీ ఎమోషన్స్ తో క్లాసీ గా ఉండనుందని తెలియజేస్తోంది. అంతే కాకుండా దీనిని సోల్‌ఫుల్ మెలోడీ గా చిత్ర యూనిట్ అభివర్నిస్తున్నారు. మాస్ మహేష్ నుంచి ఈ పాటతో మేజెస్టిక్ మహేష్ అవుతున్నాడు అని నిర్మాత అనిల్ సుంకర పోస్ట్ చేయడం విశేషం.

ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి ప్రాక్ ఈ పాటతో గాయకుడిగా సౌత్ సినీ ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు. ఇటీవల బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ నటించిన ఫిల్హాల్ అనే ఆల్బమ్‌ పాటను ప్రాక్ పాడిన విషయం తెలిసిందే. ఇది పెద్ద హిట్ అవ్వడంతో.. ఇప్పుడు మహేష్ పాటపై కూడా అంచనాలు మొదలయ్యాయి.

ఇప్పటివరకు ఎంతో మంది ఉత్తారాది గాయకులను దేవీ శ్రీ టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. అద్నాన్ సమీ, నేహా బాసిన్, మమతా శర్మ, ఫర్హాన్ అక్తర్ వంటి గాయకులకు తెలుగులో తీసుకొచ్చిన దేవీ.. వారి వద్ద నుంచి తెలుగు పలుకులను రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక సరిలేరు నీకెవ్వరు రెండో పాటపై మహేష్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

సరిలేరు నీకెవ్వరు టీం అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఒక స్ట్రాటజీ ప్రకారం పాటలని విడుదల చేస్తూ ప్రమోట్ చేస్తోంది. ఐదు సోమవారాలు, ఐదు పాటల కాంసెప్ట్ చాలా కొత్తగా ఉండటంతో అందరినీ అకట్టుకుంది. ఇటువంటి ఇన్నోవేటివ్ ప్రమోషన్స్ చేయడం టాలివుడ్ లో ఇదే ప్రధమంగా పరిగణించవచ్చు.

ఇప్పటికే మొదటి పాటకు రికార్డు వ్యూస్ రాగా మరి రెండో పాట మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఇప్పటి నుంచే ఎంతో ఆశక్తి గా ఎదురుచూస్తున్నారు. మరి వారి అంచనాలను మించి క్రేజీ సింగర్ ప్రాక్‌తో కలిసి దేవీ సృష్టించిన మ్యాజిక్ ఏమిటో తెలియాలంటే మనమందరం కొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.

ఈ సంక్రాంతికి అన్ని హంగులతో ఆల్ క్లాస్ ఆడియన్స్ ఫాన్స్ కి ఫీస్ట్ గా సంక్రాంతి ఎంటర్టైనర్ గా సరిలేరు నీకెవ్వరు ఉండబోతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో సూపర్ స్టార్ మహేష్ క్యారక్టరైజెషన్, కామెడీ టైమింగ్ హైలైట్స్ గా ఉండనున్నాయి.

పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే క్యూరియాసిటీ నెలకొంది. మహర్షి తరువాత మహేష్ చేస్తున్న సినిమా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అంచనాలకి తగ్గకుండా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ఫన్ మాత్రమే కాకుండా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది.

కొంతకాలంగా క్లాస్‌ మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో ట్రెండ్‌ మారుస్తున్నాడు. కామెడీతో పాటు మాస్‌ యాక్షన్‌తోనూ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం భారీగా హైప్‌ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా సూపర్‌ స్టార్‌ అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే తీసుకువస్తుందంటున్నారు చిత్రయూనిట్‌.

Share

Leave a Comment